“గోకులంలో సీత” నుండి “భీమ్లా నాయక్” వరకు… “పవన్ కళ్యాణ్” నటించిన 12 రీమేక్ సినిమాలు..!

“గోకులంలో సీత” నుండి “భీమ్లా నాయక్” వరకు… “పవన్ కళ్యాణ్” నటించిన 12 రీమేక్ సినిమాలు..!

by Anudeep

Ads

టాలీవుడ్ హీరోలు ఎంతమంది ఉన్నా.. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అన్న విషయం అందరికి తెలుసు. వరుస ఫ్లాపులు వెంటాడినా.. పవన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేదే లేదు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో దాదాపు మూడేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్నారు.

Video Advertisement

అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. కానీ, ఆయన ఫాలోయింగ్ ఇసుమంతైనా తగ్గలేదు అని చెప్పడానికి వకీల్ సాబ్ ఓపెనింగ్ కలేక్షేన్సే ఉదాహరణ. చాలా గ్యాప్ తర్వాత విడుదలైన వకీల్ సాబ్ కు బాగానే ఓపెనింగ్స్ వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే వకీల్ సాబ్ సినిమాతో మరొక ఇన్నింగ్స్ మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లో రీమేక్ సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

#1 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

ఈ సినిమాని హిందీ సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమా ఆధారంగా రూపొందించారు. కానీ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు.

remake movies of pawan kalyan

#2 గోకులంలో సీత:

పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా డీసెంట్ హిట్ అయింది. ఆ తరువాతే గోకులంలో సీత సినిమా వచ్చింది. ఇది కూడా హిట్ అయ్యి పవన్ ను ఫామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గర చేసింది. ఈ సినిమాను తమిళ నట గోకులత్తిల్ సీతయ్ నుంచి రీమేక్ చేసారు.

9 gokulam lo seetha

#3 సుస్వాగతం:

సుస్వాగతం సినిమా కూడా తెలుగు లో హిట్ అయింది. తమిళ సినిమా లవ్ టుడే నుంచి ఈ సినిమా ను రీమేక్ చేసారు.

4 suswagatham

#4 ఖుషి:

ఖుషి పవన్ కెరీర్ కి మంచి బూస్ట్ అప్ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి రికార్డ్స్ అన్నిటిని ఖుషి సినిమా తిరగరాసింది. ఇది తమిళ్ ఖుషి సినిమా నుంచి రీమేక్ చేసారు.

7 khushi

#6 అన్నవరం:

తమిళ సినిమా తిరుపచ్చి ని తెలుగులో అన్నవరంగా రీమేక్ చేసారు. తమిళ తిరుపచ్చిలో హీరో విజయ్ నటించారు. ఈ సినిమా తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది.

6 annavaram

#7 తీన్ మార్:

హిందీ సినిమా లవ్ ఆజ్ కల్ ను తెలుగు లో తీన్ మార్ గా రీమేక్ చేసారు. పవన్, త్రిష ఈ సినిమాలో నటించారు. ఇది ఫ్లాప్ అయిన సంగతి అందరికి తెలిసిందే.

5 teen mar

#8 గబ్బర్ సింగ్:

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన హిందీ సినిమా దబాంగ్. దీనికి తెలుగు రీమేక్ గబ్బర్ సింగ్. దబాంగ్ కు, గబ్బర్ సింగ్ కు చాలా తేడాలు కనిపిస్తాయి. గబ్బర్ సింగ్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

1 gabbar sing dabang

#9 గోపాల గోపాల:

పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడిగా కనిపించిన సినిమా గోపాల గోపాల. ఇది హిందీ మూవీ ఓ మై గాడ్ కి రీమేక్. ఈ సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది.

3 gopala gopala

#10 కాటమరాయుడు:

పవన్ కళ్యాణ్ కెరీర్ లో కాటమరాయుడు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తమిళ్ వీరంకి రీమేక్. తమిళ్ వీరంలో అజిత్ హీరోగా చేసారు.

2 katamarayudu

#11 వకీల్ సాబ్:

ఇది అందరికీ తెలిసిన విషయమే.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ లో అమితాబ్ “పింక్” నుంచి రీమేక్ చేసారు. ఇదే సినిమా ను తమిళ్ లో అజిత్ రీమేక్ చేయగా.. అక్కడ మాస్ హిట్ అయింది. ప్రస్తుతం వకీల్ సాబ్ థియేటర్లలో బాగానే ఆడుతోంది. మరి ఫలితం తేలాల్సి ఉంది.

1 vakil sab

#12 భీమ్లా నాయక్

ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ గా రూపొందుతోంది. ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొక హీరోగా నటిస్తున్నారు.

ఇవన్నీ మాత్రమే కాకుండా వినోదయ సిత్తం అనే ఒక తమిళ సినిమా రీమేక్ లో కూడా పవన్ కళ్యాణ్ నటించారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా మరొక హీరోగా నటించారు. తమిళ్ లో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ప్రముఖ నటుడు సముద్రఖని తెలుగులో కూడా దర్శకత్వం వహించారు. అలాగే త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకి పని చేశారు.


End of Article

You may also like