లూసీఫర్ రేంజ్ లో ప్రభాస్ ఎలివేషన్స్ కు సలార్ విలన్ ప్లాన్!! పృథ్వీరాజ్ కథ వినగానే ప్రభాస్..?

లూసీఫర్ రేంజ్ లో ప్రభాస్ ఎలివేషన్స్ కు సలార్ విలన్ ప్లాన్!! పృథ్వీరాజ్ కథ వినగానే ప్రభాస్..?

by Anudeep

Ads

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే వంటి సినిమాలతో హిట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో మరో సూపర్ హిట్ మూవీ తీసేందుకు సలార్ లో విలన్ గా నటించిన నటుడు, దర్శకుడు పృధ్వీరాజ్ సిద్ధంగా ఉన్నారట. ఈ మేరకు ప్రభాస్ కు కథను కూడా వివరించారట.

Video Advertisement

అయితే బాహుబలి వంటి సూపర్ డూపర్ హిట్ అందించిన ప్రభాస్ కి తరువాత అన్నీ ఫ్లాపులే ఎదురయ్యాయని చెప్పొచ్చు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, అన్నీ పరాజయాన్ని చవిచూసి… అభిమానులకు నిరాశే మిగిల్చాయి.

Prabhas-Project-K-First-Look

దీంతో ప్రస్తుతం రానున్న ప్రాజెక్ట్ కే, సాలార్ పైనే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలు హిట్ అవుతాయనే ఆశతో ఉన్నారు. దీంతో పాటు నాగ్ అశ్విన్ తో చేయనున్న కల్కి 2898 సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సలార్ షూటింగ్ జరుగుతుండగా… విలన్ పాత్రలో నటించిన పృథ్వీరాజ్ షూట్ గ్యాప్ లో ప్రభాస్ కు ఒక కథ చెప్పారు.

prabhas

మంచి గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఉన్న ఈ కథ ప్రభాస్ కూ కూడా బాగా నచ్చిందట కానీ… సినిమా చేయడంపై ప్రభాస్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదట. ఒకవేళ ప్రభాస్ ఓకే అంటే సినిమాను కేవలం 6 నెలల్లోనే తీసేందుకు పృథ్వీరాజ్ సిద్ధం అయ్యారట. అంతే కాదు ఈ సినిమాలో ప్రభాస్ కు లూసిఫర్ సినిమాలో ఇచ్చినంత ఎలివేషన్స్ ఇవ్వాలని… దెబ్బకు బొమ్మ అదరాలని పృధ్వీరాజ్ ఫిక్స్ అయ్యారు.

ఒకవేళ అదే జరిగితే ప్రభాస్ కు భారీ హిట్ సొంత అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే డార్లింగ్ అభిమానులు చేతులు కాళ్ళు ఆడటం లేదనే చెప్పాలి. కొందరైతే ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకోవాలని… తమ అభిమాన హీరో ఖాతాలో బంపర్ హిట్ పడాలని ఆశగా ఉన్నారు. చూడాలి మరి ప్రభాస్ ఈ సినిమాకు ఎప్పుడూ ఒకే చెప్తారో.

ALSO READ : బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 లో మరొక సీరియల్ సెలబ్రిటీ ఎంట్రీ..! ఎవరంటే..?


End of Article

You may also like