పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి నాజర్ రిప్లై..! ఏం అన్నారంటే..?

పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి నాజర్ రిప్లై..! ఏం అన్నారంటే..?

by Anudeep

Ads

తెలుగు, తమిళం, కన్నడ, బాలీవుడ్, అంటూ ఎవరికి వారు వేరుగా తమ చిత్ర పరిశ్రమ అంటూ పోటీ పడుతుంటారు అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది నేటి మాట. భారతదేశంలోని చిత్ర పరిశ్రమలు అన్నీ ఆ స్థాయికి చేరుకున్నాయి.

Video Advertisement

అన్నీ పరిశ్రమలు ఒక్కటే అనే ఐకమత్యం పెరిగింది. దీనికి కారణం ఎస్.ఎస్. రాజమౌళి అనే చెప్పాలి. కానీ ఇంత జరిగినా ఒకవైపు తమిళ చిత్ర పరిశ్రమ వర్సెస్ ఇతర పరిశ్రమలు అన్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. తమిళ నటులు తమిళ సినిమాల్లోనే నటించాలని, తమిళనాడులోనే షూటింగ్స్ చెయ్యాలని FEFSI పలు నిబంధనలు తీసుకొచ్చిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ మేరకు వీటిపై తాజాగా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. చిత్ర పరిశ్రమలు అన్నీ ఒకటే అని… తమిళ చిత్ర పరిశ్రమలో కేవలం తమిళం వాళ్ళే పని చేస్తే పరిశ్రమ అభివృద్ధి చెందదు అని అన్నారు. అందరం కలిసి పని చేస్తేనే అనేక భాషలు, సంస్కృతులు తెలుసుకోగలమని… అప్పుడే పరిపూర్ణమైన ఫలితాలను చూడొచ్చు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన చిత్ర పరిశ్రమ ఎల్లలు దాటుతోందని అందరూ కలిసి కట్టుగా పనించేసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.

nassar actor

అదలా ఉంటే అదే అంశంపై నటుడు నాజర్ స్పందిస్తూ… సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు FEFSI నిబంధనల పైన వస్తున్న వార్తల్లో నిజం లేదని. అలాంటి పరిస్థితే గనక కోలీవుడ్ లో వస్తే ముందు తానే నిలబడి ప్రశ్నిస్థానని అన్నారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలు దినదినాభివృద్ధి చెందుతున్నాయని, మన సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్ లో వెళ్తున్నాయి కాబట్టి ఒకరికి ఇంకొక భాష కలవారితో పని ఉంటుందన్నారు.

pawan

వాస్తవానికి ఎస్వీ రంగారావు, సావిత్రమ్మ, వాణీశ్రీ వంటి ఎందరో అగ్రతారలు తమిళ చిత్ర పరిశ్రమతో మమేకం అయి ఉన్నారని. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు FEFSI ఎప్పుడా తీసుకోదని… ఇటువంటి అసత్య ప్రచారాలను ప్రోత్సహించకుండా అందరం కలిసి పని చేద్దామని నాజర్ వీడియోలో మాట్లాడారు.

ALSO READ : బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 కంటెస్టెంట్స్ వీళ్లేనా..? లిస్ట్ మామూలుగా లేదు..!


End of Article

You may also like