Ads
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వచ్చిందంటే చాలు అభిమానుల సందడి ఇంతా కాదు. ఆయన నడక, స్టైల్, యాక్టింగ్, ప్రతిదీ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అయితే ఇప్పుడు ఆఖరికి ఆయన సినిమా టైటిల్ కూడా… ఓ డైరెక్టర్ పొట్ట కొట్టే అంత ఇంపాక్ట్ చూపిస్తోంది. ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొస్తోంది. అసలు ఏమ్ జరిగిందంటే!!
Video Advertisement
ముందు ఒక మాట ఏంటంటే రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదల అవ్వడానికి రెడీగా ఉంది. కానీ ఈ సినిమాలో ఏదో సీన్ కో, లేక అందులోని నటులకో వచ్చిన సమస్య కాదు.
ఈ సినిమాకు ఎంతో ముఖ్యమైన టైటిల్ వల్లే పెద్ద సమస్య వచ్చి పడింది. అయితే తమిళ్ లో జైలర్ పేరుతో రజినీకాంత్ తో భారీ సినిమా వస్తోంది. కానీ ఇదే టైటిల్ తో మలయాళ దర్శకుడు సక్కిర్ మడథిల్ కూడా ఓ సినిమా చిత్రీకరిస్తున్నారు. అక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. వాస్తవానికి తలైవా సినిమా వస్థే చాలా మంది మరో సినిమా వైపు కన్నెత్తి చూడరు. అలాంటిది ఒకటే పేరుతో రెండు సినిమాలు వస్తె అందరూ కచ్చితంగా రజినీకాంత్ సినిమానే చూస్తారు.
అలా జరిగితే సక్కిర్ మడథిల్ చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఆయన ఈ సినిమా టైటిల్ మార్చమంటూ అప్పటికే సన్ పిక్చర్స్ వారిని సక్కిర్ మడథిల్ వేడుకోగా… అటు నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఈ సినిమాను మడథిల్ కేవలం 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించారట. దీనికోసం తన కూతురి నగలు అమ్మి, కారు అమ్మేసి, త్వరగా అప్పు తీరిచుకోవచ్చులే అని ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకుని మరీ ఈ సినిమాను తన సొంత డబ్బులతో నిర్మించానని చెప్పారు.
1957 లో జరిగిన నిజ జీవిత సంఘటనను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా సక్కిర్ మడథిల్ ది. దీనికి జైలర్ అనే టైటిల్ 2021 లోనే రిజిస్టర్ చేయించానని… కానీ తర్వాతే తెలిసింది కొద్దిరోజులకు ఈ టైటిల్ తో రజినీకాంత్ – నెల్సన్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారని తెలిసిందట. మరి ఇప్పటికే సన్ పిక్చర్స్ వారిని వేడుకున్నా కూడా ఎటువంటి స్పందన రాలేదు… కనీసం రజినీకాంత్ గారైన అయినా స్పందిస్తే నా జీవితం బాగుపడుతుందని… లేకపోతే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కూడా అప్పుడప్పుడు వస్తోందని వాపోయారు. మరి చివరికి ఏమవుతుందో, రజినీకాంత్ స్పందిస్తారో లేదో చూడాలి.
ALSO READ : “బ్రో” మూవీలో “సాయి ధరమ్ తేజ్ రెండవ చెల్లెలు” గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..?
End of Article