నాగార్జునని పక్కన పెట్టి మరీ కథ చెబితే నాని నో అన్నారా..? ఎందుకో తెలుసా?? 

నాగార్జునని పక్కన పెట్టి మరీ కథ చెబితే నాని నో అన్నారా..? ఎందుకో తెలుసా?? 

by Anudeep

Ads

న్యాచురల్ స్టార్ నాని సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ. ఏటువంటి వారైనా అవును నాని సినిమా చూడొచ్చు, నానీని నమ్మొచ్చు, నానీ సినిమాలు బాగుంటాయి అనే ముద్ర పడిపోయింది. దానికి తగ్గట్టే నాని వరుస సినిమాలతో దూసుకుపోతూ… అందరికి చేరువయ్యారు.

Video Advertisement

నానీని హీరోగా కంటే కూడా మనోడే మన పక్కిందు కుర్రాడే అనే ఫీలింగ్ లోనే ఎక్కువగా ఉంటారు. ఇక నానీ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దాటుకుని సొంతంగా ఇప్పుడు తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు.

nani

ప్రస్తుతం హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ… దసరా మూవీ ద్వారా శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. నాని కొత్త డైరెక్టర్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. అయితే నాని ఇప్పటికే హాయ్ నాన్న వంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫాదర్, డాటర్, మదర్ ఎమోషన్స్ తో కూడిన సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో నాని సరసన మృణాళ్ ఠాకూర్ నటిస్తున్నారు. ఇది కూడా మంచు హిట్ అవుతుందని ఆడియన్స్ ఫిక్స్ ఐపోయారు. ఇదిలా ఉంటే నాని వరస పెట్టి సినిమాలు తీసెయ్యలని ఫిక్స్ అయ్యి… అందరూ కొత్త డైరెక్టర్ల దగ్గర కథలు వింటున్నారు. ఇక తరువాత సింపుల్ కూల్ గా కాకుండా యాక్షన్ ఓరియంటెడ్ నేపథ్యంలో… డివీవి దానయ్య నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తదుపరి మోహన్ రాజాతో కలిసి చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.

అయితే తమిళంలో ఎంతో మంచి హిట్స్ ఉన్న మోహన్ ఇప్పుడు తెలుగులో అడుగుపెట్టి తొలుత నాగార్జున 100వ సినిమా తీయనున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. కానీ దానికంటే ముందే మోహన్ రాజాకి వేరే ప్లాన్స్ ఉన్నందుకు లేక కథలో ఉన్న పట్టు వల్లనో, ముందు నానితో చెయ్యాలని పట్టు పట్టి రెండు కథలు వినిపించారు. మొదటి కథ నచ్చకపోవడంతో ఇంకో మంచి కమర్షియల్ కథ వినిపించారట. దీనికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి నానితో ముందు సినిమా ఓకే చేయించుకుని నాగార్జున సినిమా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ALSO READ : “దుల్కర్ సల్మాన్” నెక్స్ట్ సినిమా కథ ఇదేనా..? ఏంటంటే..?


End of Article

You may also like