కరణ్ జోహార్, రణవీర్ సింగ్ ను దులిపేసిన కంగనా రనౌత్… కారణం ఏంటో తెలుసా?? 

కరణ్ జోహార్, రణవీర్ సింగ్ ను దులిపేసిన కంగనా రనౌత్… కారణం ఏంటో తెలుసా?? 

by Anudeep

Ads

హీరోయిన్లలో ముక్కుసూటిగా మొహం మీద మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే మొట్ట మొదట గుర్తొచ్చేది కంగనా రనౌత్. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు చేస్తూ స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేస్తుంది. కానీ దానికంటే కూడా ఎక్కువగా తన ముక్కుసూటితనంతో ఎక్కువ ట్రెండ్ లో ఉంటుంది. ఇక తాజాగా కరణ్ జోహార్, రన్వీర్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Video Advertisement

అయితే జూలై 28న కరణ్ జోహార్ దర్శక నిర్మాతగా చిత్రీకరించిన రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకి 250 కోట్లు పెట్టి తీస్తే కేవలం 11 కోట్లు రాబట్టింది. దీంతో కంగనా కౌంటర్లు విసిరింది. నీకు పతనం మొదలయ్యింది కరణ్.

ఇంకా నైంటిస్(90’s) లో తీసినట్టే సినిమాలు తీసుకుంటూ కూర్తుంటే ఇలాంటి పిచ్చి సొల్లు సినిమాలు ఎవరు చూస్తారు? ప్రేక్షకులు పిచ్చోళ్లు కాదు అని 3 గంటలు ఉన్నా సరే వాళ్లకి ఓపెన్ హైమర్ లాంటి సినిమాలే నచ్చుతాయి అని విమర్శించింది. అయినా అత్తా కోడళ్ళ డ్రామాపై 250 కోట్లు అవసరమా. పాతకాలంలో తీసినట్టు తీసిన నీ సినిమాలను నువ్వే కాపీ చెయ్యడానికి నీకు సిగ్గు లేదా?? నీకు నువ్వేదో పెద్ద ఫిల్మ్ మేకర్ అని జబ్బలు చరుచుకుంటే సరిపోదు.

Rocky-Aur-Rani-Kii-Prem-Kahaani-Review

బయట ఎంతో ట్యాలెంట్ ఉండి కష్టాలు పడే వాళ్ళు ఉంటే ఇలాంటి చెత్త సినిమాలు తియ్యడానికి కోట్లు ఖర్చు చేసి డబ్బును వృధా చేస్తున్నారని,కాస్త కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వుమంటూ తిట్టిపోసింది. ఇక రణవీర్ సింగ్ ను కూడా తన వస్త్రాభరణంపై కామెంట్లు చేసింది. రణవీర్ నీకు ఓ రిక్వెస్ట్, కొంచం నీ డ్రెస్సింగ్ లుకింగ్ సెన్స్ మార్చు, సౌత్ హీరోలను చూసి కాస్తైనా నేర్చుకో… వాళ్ళు ఎలా కనిపిస్తుంటారు చూసి నేర్చుకో. పిచ్చి పిచ్చిగా తయారు అయ్యి మన సంస్కృతిని నాశనం చెయ్యకు అంటూ కౌంటర్లు వేసింది. ప్రస్తుతం కంగనా చేసిన పోస్టు సినీ వర్గాల్లో… ముఖ్యంగా బాలీవుడ్ వర్గాల్లో సెగ పెడుతోంది.

ALSO READ : ఇష్టం లేదు అంటే ఏం చేయలేం..! హీరో విశాల్ కామెంట్స్..!


End of Article

You may also like