బేబీ సినిమా కాపీనా..? డైరెక్టర్ ఏం అన్నారంటే..?

బేబీ సినిమా కాపీనా..? డైరెక్టర్ ఏం అన్నారంటే..?

by Anudeep

Ads

తక్కువ బడ్జెట్ తో, పెద్దగా ఫేమస్ కాకపోయినా మోస్తరుగా ఫాలోవర్స్ ఉన్న నటులతో… సాయి రాజేష్ దర్శకత్వం వహించిన సినిమా బేబీ. విడుదలైన మొదటి రోజే వావ్ అనిపించిన కలెక్షన్స్ రాబట్టింది. కేవలం రెండు వారాల్లోనే 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Video Advertisement

ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి కారణం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ల నటన ఒక కారణమైతే… ఈ సినిమాలోని కథ కీలకం అని చెప్పొచ్చు. అందుకే చాలా మందిని ఎడ్పించి మెప్పించింది.

అయితే ఈ బేబీ కథకు సంబంధించి కొన్ని సంచలన నిజాలు బయట పడ్డాయి. వాటిని సాయి రాజేష్ ఏ స్వయంగా బయట పెట్టారు. ఈ కథ కాపీ చేశారని… అది నిజానికి నా నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నాను కానీ దానిని కాపీ చేశారని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన లైఫ్ లో 2012 లో రియల్ గా జరిగిన ప్రేమ కథను ట్రయంగిల్ లవ్ స్టోరీగా రాసి… 2018 లో పూర్తి కథను పూర్తి చేసుకున్నాని, ఈ కథను ఎన్నో చోట్ల ఎంతో మందికి చెప్పానని… కొందరికి స్క్రిప్ట్ కూడా ఇస్తే…చివరికి ఇప్పుడు తెలుగులో నా కథను కాపీ చేసి బేబీ సినిమా తీశారని దినేష్ కుమార్ డీకే అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీనిని ఓ తమిళ క్రిటిక్ రిపోస్ట్ చేసి సాయి రాజేష్ ను ట్యాగ్ చేయగా… దానిని షాట్ తీసి ఇంకేముంది దీని మీద వార్తలు రాసుకోండి అంటూ సాయి రాజేష్ ట్వీట్ చేశారు. ఏదైనా సినిమా బాగా హిట్ అయినప్పుడు తొందరగా ఫేమస్ అవ్వడానికి ఇలాంటి ట్రిక్స్ వాడతారని…ఇది అలానే ఉందని అన్నారు. బహుశా బేబీ సినిమాలో జరిగినట్టే అనేకమంది అటువంటి అనుభవం ఎదుర్కొని ఉండొచ్చు… యాదృచ్ఛికంగా ఇలాంటివి చాలానే జరుగుతాయి. మరి ఈ పోస్ట్ ఏ కోవకు చెందినదో తెలియదంటూ పోస్ట్ చేశారు.

baby-movie

కాకపోతే ఈ కథ తమిళనాడులో చోటు చేసుకున్న రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తీసినట్టు సాయి రాజేష్ అప్పటికే చెప్పడం గమనార్హం. దీంతో నిజంగానే ఈ కథ కాపీనా అనే అనుమానాలు కొందరిలో మొదలయ్యాయి. ఏదేమైనా మూవీ టీం సక్సెస్ ని ఎంజాయి చెయ్యడంలో మునిగి పోయారు.

ALSO READ : కరణ్ జోహార్, రణవీర్ సింగ్ ను దులిపేసిన కంగనా రనౌత్… కారణం ఏంటో తెలుసా??


End of Article

You may also like