“బ్రో” సినిమా కోసం ముందుగా అనుకున్న హీరోలు ఎవరో తెలుసా..? ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే..?

“బ్రో” సినిమా కోసం ముందుగా అనుకున్న హీరోలు ఎవరో తెలుసా..? ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే..?

by Anudeep

Ads

కొన్ని సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. కానీ అంచనాలకు తగ్గట్టు లేకపోతే ప్రేక్షకులు నిరాశ పడటమే కాకుండా అసలు మళ్లీ ఆ సినిమా ఊసే ఎత్తరు. అలాంటి కోవకు చెందిందే బ్రో సినిమా. ఎన్నో ఆశలతో పవన్ కళ్యాణ్ మూవీ కోసం వెళితే చాలా వరకు అభిమానులకు నిరాశే మిగిలిందని చెప్పొచ్చు.

Video Advertisement

అయినా సినిమా కలెక్షన్స్ మాత్రం పెద్ద ఎత్తునే లాభాలు రాబడుతోంది. దానికి ఏకైక కారణం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే అని కచ్చితంగా చెప్పొచ్చు. కానీ ఈ సినిమాకి మొదట పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ను అనుకోలేదట.

bro movie review

అయితే నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో… పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలయికతో తేరకెక్కిన బ్రో చిత్రం జూలై 28న ఘనంగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ నటించగా… రోహిణి, ప్రియా ప్రకాష్ వారియర్, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే 30 కోట్ల లాభాలను రాబట్టింది. ఇదంతా పవన్ కళ్యాణ్ పేరుకు ఉన్న క్రేజ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

నిజానికి ఈ సినిమా కోసం మొదట ప్రభాస్, అక్కినేని అఖిల్ తో తీయాలని దర్శకుడు సముద్రఖని ఆలోచన. కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ తో కనీసం కలవడం కూడా కుదరక పోవడంతో… అక్కడే ఆగిపోకుండా సూర్య, కార్తీ లను అనుకున్నారట. కానీ వారి నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో…సీన్ లోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంటర్ అయ్యారు.

ఈ పాత్రలకు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఎందుకు ఉండకూడదు. వాళ్లైతే ఈ పాత్రలకు సరిగ్గా సరిపోతారని సముధ్రఖనికి చెప్పడంతో వెంటనే ఓకే చెప్పేశారట. అంతే ఇక ఆలస్యం చెయ్యకుండా సినిమా పూర్తి చేశారు. వాస్తవానికి ప్రేక్షకులు కూడా ఈ కథకు వీళ్ళే కరెక్ట్ అని, అసలు సాయి ధరమ్ తేజ్ రియల్ లైఫ్ లో జరిగిన సంఘటన ఈ కథకు సరిగ్గా సరిపోతుందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ పాత్రకు సాయి ధరమ్ తేజ్ అయితేనే సరిగ్గా సరిపోయాడని మెచ్చుకున్నారు.

ఏదేమైనా కథ బాగుండటం, డైలాగులు బాగుండటం, సాయి ధరమ్ తేజ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనకు ఈ సినిమా కథ దగ్గరగా ఉండటం… ఇవన్నీ కలిపి ఒక ప్లస్ అయితే… సినిమా మంచి కలెక్షన్స్ అందుకోవడానికి పవన్ కళ్యాణ్ ఏ ముఖ్య కారణమని, ఆయన కాకుండా ఎవరు చేసిన కచ్చితంగా ఇది ఫ్లాప్ అయ్యి ఉండేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ : 2023 లో వచ్చిన 12 “వరస్ట్ సినిమాలు” ఇవే..! ఏవి ఉన్నాయంటే..?


End of Article

You may also like