Ads
సార్ ఒస్తార్ ఒస్తారే… అయ్యో పాట పాడట్లేదండి. నిజంగానే మన సూపర్ స్టార్ బిజినెస్ మ్యాన్ గా వస్తున్నారు. పూరి జగన్నాథ్ దరశకత్వంలో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ నటించిన మూవీ బిజినెస్ మ్యాన్. ఈ సినిమాతో సినీ ప్రేమికులతో పూరీ జగన్నాథ్ కట్టి పడేయాలి అనుకున్నారు. అందుకే రీ రిలీజ్ అవుతున్నా కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు.
Video Advertisement
అయితే 2012 లో విడుదలై బాక్సాఫీసు దగ్గర సెంచరీలు కొట్టిన ఈ సినిమా… మళ్ళీ ఆగస్ట్ 9 వ తేదీ నాడు మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ గా రీ రిలీజ్ అవ్వబోతోంది. ఈ మేరకు టికెట్ల బుకింగ్ హడావుడి మొదలయ్యింది. 4k వర్షన్ తో రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షోకే విశాఖ పట్నం, ఇంకోవైపు శరత్ థియేటర్లలో 7:30 షో కు fdfs టికెట్లు అమ్ముడు అయ్యాయి.
ముంబై ఏలేద్దాం అనే కాన్ఫిడెన్స్ తో ఉన్న కుర్రాడి ఆలోచనలకు, మ్యాసివ్ డైలాగులు యాడ్ అవ్వడంతో సినిమా పీక్ లెవల్ లో ప్రేక్షకులకు నచ్చేసింది. ఇందులో మహేష్ బాబు ఒక డాన్ లాగా సైలెంట్ బట్ వైలెంట్ అన్నట్టుగా నటించిన తీరు అభిమానులను ఆకర్షించింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్ నటించగా… ప్రకాష్ రాజ్, షాయాజీ షిండే, ధర్మవరపు సబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో పోషించారు. ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ ఈ సినిమాకు నిర్మిస్తే, థమన్ మ్యూజిక్ అందించారు.
ALSO READ : మొన్న ఏమో వాటర్‌బాయ్… ఇప్పుడు ఏమో..? ఏంటి కోహ్లీ ఇది..?
End of Article