Ads
చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది బేబీ మూవీ. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ ఈ సినిమాను నిర్మించగా… వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను పాలువు సినీ ప్రముఖులు కూడా మెచ్చుకున్నారు.
Video Advertisement
రవితేజ, సుకుమార్, మెగా స్టార్ చిరంజీవి వంటి వారు కూడా ఈ సినిమాలో నటులను అభినందించారు. మొత్తంగా తక్కువ సమయంలోనే సుమారు 80 కోట్ల రూపాయల వరకు బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టి, నిర్మాతలను లాభాల బాటలో తీసుకెళ్ళింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించేందుకు మొదట వీళ్ళ కంటే ముందు వేరే వాళ్ళని డైరెక్టర్ సంప్రదించినట్లు సమాచారం. దాంట్లో భాగంగా ఆనంద్ పాత్రకు ఆనంద్ దేవరకొండ కంటే ముందు విశ్వక్ సేన్ ను అనుకున్నట్టు వార్తలు రావడం వింటూనే ఉన్నాం. ఈ క్రమంలో విశ్వక్ సేన్ సాయి రాజేష్ కథ వినడానికి నిరాకరించాడని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో విశ్వక్ దీనికి సంబంధించి ఇండైరెక్ట్ గా తన పేక మేడలు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడాడు. తను అందరినీ హ్యాపీ చెయ్యడానికి బిర్యానీ కాదని… సినిమా హిట్ అయితే సంబురాలు చేసుకోవాలి కానీ ఇంకొకరిని కించపరిచేలా మాట్లాడకూడదు అని వ్యాఖ్యానించాడు. దీంతో విశ్వక్ సేన్ మాటలు బాధించాయని, సాయి రాజేష్ అన్నారు. అసలు నేను ఎక్కడా కూడా విశ్వక్ పేరు ఎత్తలేదు. హీరోలు ఎవరైనా కథను వొద్దు అని చెప్పే విధానం బాగుంటే మంచిగా ఉంటుందని చెప్పాను అంతే.
అయినా తన మీద నాకేమీ కోపం లేదు, ఒకప్పుడు వెల్లిపోమకే అనే తన సినిమా విడుదల చేయడానికి ఎంతో కృషి చేశాము అనుకుంటూ ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా విశ్వక్ బిహేవియర్ తో సాయి రాజేష్ బాధ పడ్డారని తెలుస్తోంది. ఏదేమైనా సినీ పరిశ్రమలో చిన్నపాటి మనస్పర్థలు సహజం. కొంత కాలం పోయాక అవే సద్దుమనుగుతాయి అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ : సీరియస్ పాత్రలు మాత్రమే కాదు… కామెడీ కూడా చేస్తుందా..? ఈ సినిమా చూశారా..?
End of Article