Home Filmy Adda OTT లో విజృంభణ సృష్టిస్తున్న విమానం మూవీ..!

OTT లో విజృంభణ సృష్టిస్తున్న విమానం మూవీ..!

by Anudeep

శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జి స్టూడియోస్ కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ కలిసి నిర్మించిన సినిమా విమానం. ఇందులో సముద్రఖని ప్రధాన పాత్ర పోషించగా… మీరాజాస్మిన్ అనసూయ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.

అయితే శివప్రసాద్ యానాలా దర్శకుడిగా పరిచయమైన విమానం సినిమా థియేటర్లలో జూన్ 9న రిలీజ్ అవ్వగా ప్రేక్షకుల నుంచి అభినందనలు ఆదరణ పొందింది కానీ పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

vimanam movie review

అయితే మంచి ఎమోషనల్ సెంటిమెంటల్ డ్రామాగా తెరకెక్కిన విమానం సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోయినప్పటికీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. జి 5 ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా విడుదలవగా ఇప్పటికే వంద మిలియన్ వీవ్స్ సంపాదించుకుంది. ఇలానే మరిన్ని వీవ్స్ సంపాదించే అవకాశం ఉంది.

vimanam movie review

ఈ సినిమాలో సముద్రఖని వీరయ్య అనే పాత్రను పోషిస్తాడు. ఆ వీరయ్య అవిటివాడు అయినప్పటికీ తన కొడుకు విమానం ఎక్కాలి అన్న కోరికను ఎలా తీరుస్తాడో ఈ సినిమాలో చూపిస్తారు. మనసుకి హత్తుకునే సన్నివేశాలు డైలాగులు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. సినిమా చూసిన చాలామంది కంటతడి పెట్టకుండా ఉండలేక పోతారు.

vimanam movie review

థియేటర్లో పెద్ద కలెక్షన్స్ రాబట్టకపోయినా ఓటీటీలో మంచి ఆదరణ పొందుతున్న సినిమా విమానం. అయితే ఈ సినిమాతోనే మీరాజాస్మిన్ కూడా మళ్లీ తెలుగు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా అందరిని ఎమోషన్స్ తో కట్టిపడేసే విమానం సినిమా ఓటీటీలో రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.

ALSO READ : అప్పు తీసుకుని మీకు చెల్లించడం లేదా..? తిరిగిరాబట్టడానికి ఈ 3 బెస్ట్ ఆప్షన్స్…!

You may also like