Ads
ప్రజల పాట ఆగిపోయింది. అలుపెరుగని పోరాటం చేసిన ప్రజా గాయకుడి గొంతు మూగబోయింది. తెలంగాణ సాధనలో ముఖ్యపాత్రను పోషించిన ప్రజా కవి గద్దర్ ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు.
Video Advertisement
గుండె సంబంధితమైన అనారోగ్యంతో అపోలో హాస్పటల్ లో చేరిన గద్దర్ జులై 31న తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు. ఆ లేఖలో త్వరలోనే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తానని తెలిపారు. కానీ ఆయన మరలి రాని లోకాలకు వెళ్లిపోయారు. తిరిగి వస్తానని మాట కూడా ఇచ్చావు గద్దర్ అన్నా అంటూ అభిమానులు దుఖంలో మునిగిపోయారు.
అనారోగ్యంతో హాస్పటల్ చేరిన గద్దర్, గుండెకు సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా జరిగినప్పటికీ, గతంలో ఆయకు ఉన్న లంగ్స్ సమస్య కారణంగా తిరిగి కోలేక, అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణించక ముందు జులై 31న తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. హాస్పటల్ ఉండగానే ఆ లేఖను విడుదల చేశారు.
అందులో గద్దర్ ఈ విధంగా రాసుకొచ్చారు. తన పేరు గుమ్మడి విఠల్. తన పాట పేరు గద్దర్ అని, తన బ్రతుకు సుదీర్ఘ పోరాటం అని, తన వయస్సు 76 ఏళ్ళు. తన వెన్నుముకలో ఉన్న బుల్లెట్ వయస్సు 25 ఏళ్లు. తాను ఇటీవల సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క నిర్వహించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నానని తెలిపారు.
గుండె సంబంధిత చికిత్స కోసం అమీర్ పేట్ లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో చేరానని, జూలై 20 నుండి ఈరోజు వరకు పరీక్షలన్ని చేయించుకుని, ట్రీట్మెంట్ తీసుకుంటూ మెల్లగా కుదుట పడుతున్నాను. కొలుకుని, ఆరోగ్యంతో తిరిగి మీ వద్దకి వస్తానని, సాంస్కృతిక ఉద్యమంను తిరిగి మొదలుపెట్టి, ప్రజల యొక్క రుణం తీర్చుకుంటానని లేఖలో వెల్లడించారు. కానీ ఆయన హాస్పటల్ లోనే కన్నుమూసి, అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆ విషయాన్ని తలచుకుని మరింతగా గద్దర్ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
Also Read: ఒరేయ్ రిక్షా “నా రక్తంతో తడుపుతాను” పాటతో పాటు… “గద్దర్” కలం నుండి జాలువారిన 10 సూపర్ హిట్ పాటలు..!
End of Article