ఒరేయ్ రిక్షా “నా రక్తంతో తడుపుతాను” పాటతో పాటు… “గద్దర్” కలం నుండి జాలువారిన 10 సూపర్ హిట్ పాటలు..!

ఒరేయ్ రిక్షా “నా రక్తంతో తడుపుతాను” పాటతో పాటు… “గద్దర్” కలం నుండి జాలువారిన 10 సూపర్ హిట్ పాటలు..!

by kavitha

Ads

తెలంగాణ ప్రజాగాయకుడు, విప్లవ కవి, జానపద కళాకారుడు గద్దర్ ఆదివారం ఆగస్ట్ 6న మధ్యాహ్నం మూడు  గంటల సమయంలో అపోలో హాస్పటల్ లో తుది శ్వాస విడిచారు. గద్దర్ కుమారుడు ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు.

Video Advertisement

గద్దర్ పాటలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు సుపరిచితమే. గాయ‌కుడిగా, ఉద్య‌మ‌కారుడిగా, గద్దర్ తెలంగాణ పై చెర‌గ‌ని ముద్రను వేశారు. ప్రధానంగా గద్దర్ రాసిన పాటలు ప్రజలలో చైతన్యాన్ని రగిలించాయి. యువ ఉద్యమ కారులను ఉత్సాహంతో ముందుకు నడిపేలా చేశాయి.
ప్రజా గాయకుడిగా గద్దర్ ఎన్నో స్టేజ్ ల మీద  పాటలు పడుతూనే, మారో వైపు ఉద్యమ చిత్రాలకు పాటలు కూడా రాశారు. అలా సినిమాలలోని ఉద్యమ పాటల ద్వారా గద్దర్ త్వరగా ప్రజలకు చేరువయ్యారు. వాటిలో ముఖ్యంగా దర్శకరత్న దాసరి నారాయణ రావు, నటుడు మరియు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన చిత్రాలకు ఆయన ఎక్కువగా సాంగ్స్ రాశారు.
అంతేకాకుండా 1979 లో ‘మా భూమి’ అనే మూవీలో  బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి అనే పాటను గద్దర్ పాడారు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట సమయంలో ఈ పాట ప్రధాన పాత్రను పోషించి, ప్రజలను ఉత్తేజితపరిచిన పాటగా నిలిచింది. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆయన పాడిన బండెనక బండి కట్టి పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అంతలా గద్దర్ ప్రజాగాయకుడుగా తెలంగాణ ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారు. గద్దర్ పాటలలో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. బండెనక బండి కట్టి – మా భూమి:

2. భద్రం కొడుకో – రంగుల కల:

3. పొడుస్తున్న పొద్దుమీద – జై భోలో తెలంగాణ:

4. అడవి తల్లికి వందనం – దండకారణ్యం:

5. మల్లె తీగకు పందిరి వోలే – ఒరేయ్ రిక్షా:

6. నా రక్తంతో నడుపుతాను రిక్షాను – ఒరేయ్ రిక్షా

7. భారత దేశం – దండకారణ్యం:

8. దుక్కులి దున్నిన – అన్నదాతా సుఖీభవ:

9. మేలుకో రైతన్న మేలుకో – సాఫ్ట్ వేర్ సుధీర్:

10. బానిసలారా లెండిరా – v6

Also Read: బలగం సినిమాలాగానే సెన్సేషన్ అయ్యింది..? ఈ సినిమా చూశారా..?


End of Article

You may also like