రజనీకాంత్ యోగి కాళ్ళకి ఎందుకు మొక్కారు..? దానికి కారణం ఇదేనా..?

రజనీకాంత్ యోగి కాళ్ళకి ఎందుకు మొక్కారు..? దానికి కారణం ఇదేనా..?

by kavitha

Ads

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ రిలీజ్ కు ముందు హిమాలయలకు వెళ్ళి అక్కడ ఉన్న ఆలయాలను దర్శించుకున్నారు. ఆయన తిరుగు ప్రయాణంలో ఉత్తర్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన విషయం తెలిసిందే.

Video Advertisement

అయితే రజనీకాంత్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం కోసం ఆయన నివాసానికి వెళ్లారు. రజనీకాంత్ కు స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎదురు వచ్చారు. ఆ సమయంలో రజనీకాంత్ యోగి కాళ్లకు నమస్కరించారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జైలర్‌’ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి,  బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ పలు దేవాలయాల దర్శిస్తూ, ఉత్తరప్రదేశ్ కు చేసరుకున్నారు. ఈ క్రమంలో రజనీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ ని కలిసి, ఆయనతో ‘జైలర్‌’ మూవీని చూశారు. అయితే రజినికాంత్ కు స్వాగతం పలికిన సీఎం యోగి కాళ్లకు రజినికాంత్ నమస్కారం చేశారు. రజినికాంత్ లాంటి పెద్ద హీరో తన కన్నా చిన్న వయసులో ఉన్న యోగి ఆదిత్య నాథ్‌ కాళ్ళకు నమస్కరించడం ఇటు తమిళనాడులో, అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో చేతులతో  నమస్కరించడమో లేదా షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం లాంటివి కాకుండా యోగి పాదాలకు ఎందుకు నమస్కారం చేశారని అభిమానులు, నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.
రజనీకాంత్‌కు 72 సంవత్సరాలు కాగా, సీఎం యోగి వయసు 51 ఏళ్లని, రజిని తనకంటే వయసులో చాలా చిన్నవాడైన యోగి కాళ్లకు మొక్కడం ఆయన అభిమానులు బాధపడుతున్నారు. రజనీకాంత్ యాంటీ ఫ్యాన్స్ రజిని సినిమాలలోని కొన్ని సన్నివేశాలతో ట్రోల్ చేస్తున్నారు. ‘రజనీకాంత్ ఆత్మగౌరవాన్ని తమిళనాడులోనే వదిలేసి, యోగి కాళ్లకు నమస్కరించారు’ అని విమర్శిస్తున్నారు. అయితే కొందరు సీఎం యోగి సన్యాసి కావడం వల్లనే రజనీ అలా నమస్కరించాడని, అందులో తప్పులేదని వాదిస్తున్నారు. రజనీ ఆథ్యాత్మిక కోణంలో అలా చేశారని కొందరు అంటున్నారు.

Also Read: “సామజవరగమన” లో ఈ సీన్ ఎందుకు డిలీట్ చేసారో.? “వెన్నెల కిశోర్” కామెడీ మాములుగా లేదుగా.?


End of Article

You may also like