ఎన్టీఆర్ 100 రూపాయల “నాణెం” ధర ఎంతో తెలుసా..? ఏ పదార్ధాలతో తయారు చేశారు అంటే..?

ఎన్టీఆర్ 100 రూపాయల “నాణెం” ధర ఎంతో తెలుసా..? ఏ పదార్ధాలతో తయారు చేశారు అంటే..?

by kavitha

Ads

కేంద్రం ప్రభుత్వం నటసార్వభౌమ నందమూరి తారకరామారావుగారి జ్ఞాపకార్థంగా ఆయన బొమ్మను వంద రూపాయల నాణెం పై ప్రత్యేకంగా ముద్రించిన విషయం తెలిసిందే. ఈ నాణెన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో రిలీజ్ చేయాలని కేంద్రం ప్రభుత్వం భావించింది.

Video Advertisement

సోమవారం నాడు నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యుల సమక్షంలో 100 రూపాయల స్మారక నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ  కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, పాల్గొన్నారు. ఈ నాణేన్ని కొనుగోలు చేయడం కోసం ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలుగువారి ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుగారికి జాతీయ గుర్తింపు లభించింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆయన బొమ్మతో 100 రూపాయల స్మారక నాణెంను ముద్రించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఈ నాణెంను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు, ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, ఎన్టీఆర్ కుటుంబీకులు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణలోని మింట్ కాంపౌండ్‌లో ఈ నాణేన్ని తయారుచేశారు. అయితే వ్యక్తి స్మారకార్థం రూపొందించిన మొదటి  నాణెం ఎన్టీఆర్‌దే కావడం విశేషం. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో తయారు చేశారు. ఈ నాణెంను నేడు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి అమ్మకానికి అందుబాటులోకి తెచ్చారు.
మొదటి విడతగా పన్నెండు వేల ఎన్టీఆర్ స్మారక నాణేలను ముద్రించారు. డిమాండ్ పెరిగితే మరిన్ని తయారు చేస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ చిత్రంతో వచ్చిన నాణెంను కొనడానికి ఎంతోమంది తెలుగువారు ఆసక్తి చూపుతున్నారు. ఈ నాణెం ధర 3500 నుండి 4000 వరకు ఉంటుందని మింట్ అధికారులు చెప్తున్నారు. ఈ నాణేన్ని కావాలనుకునవారికి, ప్యాక్ చేసి అందిస్తారు కాబట్టి ధరలో స్వల్ప తేడాలు ఉండవచ్చని వారు వెల్లడించారు.

Also Read: OG కొత్త పోస్ట‌ర్‌లో… “ప‌వ‌న్ క‌ళ్యాణ్” చేతికి ఉన్న‌ టాటూ అర్థం ఏంటో తెలుసా..?


End of Article

You may also like