Ads
ఈమధ్య సినిమాలు రిలీజ్ కావడమే లేటు.. వెంటనే ఇంకా ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్నాయి. ఇంటి పనులు లేదా ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండేవాళ్లు థియేటర్‌కి వెళ్లి చూసే సమయం లేక ఓటీటీనే ఆశ్రయిస్తుంటారు. కొత్తగా వచ్చిన సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు.
Video Advertisement
కానీ కొన్ని సినిమాలు వెంటనే ఓటీటీలోకి వస్తే మరికొన్ని సినిమాలు లేటుగా వస్తాయి. ఈ లిస్ట్‌లో ప్రస్తుతం చాలా సినిమాలే ఉన్నాయనుకోండి. అయితే కొన్ని సినిమాలు ఎలాంటి ప్రకటన చేయకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా సడెన్ షాక్ ఇచ్చింది ‘హర్’ సినిమా. శ్రీధర్ స్వరాఘవ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రుహాని శర్మ ప్రధాన పాత్రలో కనిపించింది.
అయితే ఈ సినిమా జులై 21న థియేటర్లలో వచ్చిన రెండు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏసీపీ అర్చన ప్రసాద్(రుహానీ శర్మ) కేశవ్‌ను పట్టుకునే ఆపరేషన్‌లో భాగంగా తన ప్రియుడిని కోల్పోతుంది. దీని తర్వాత అర్చన ఆరు నెలలు సస్పెన్షన్‌కు గురవుతుంది. మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యే సమయానికి సిటీలో రెండు హత్యలు జరుగుతాయి.
అప్పుడే ఈ కేసుకి సంబంధించి లింక్‌లు కూడా దొరుకుతాయి. అయితే సిటీలో జరిగిన రెండు హత్యలకు ఏదైనా కనెక్షన్ ఉందా? అర్చన కేశవ్‌ను పట్టుకుంటుందా? వంటి విషయాలు తెలియాలంటే ఓటీటీలో సినిమా చూసేయండి మరి.
End of Article