హిట్ 2 కి ”అడివి శేష్” రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

హిట్ 2 కి ”అడివి శేష్” రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

by Megha Varna

హిట్ మొదటి భాగం అందరికీ నచ్చేసింది. ఈ సినిమా లో విశ్వక్సేన్, రుహాని శర్మ జంటగా నటించారు. అయితే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ ఈ సినిమా లో జరుగుతూ ఉంటుంది. ఈ కథ నడుస్తుంది. హిట్ ఫస్ట్ కేస్ 2020 లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ రానుంది.

Video Advertisement

ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నారు.

ట్రైలర్ ఇంత బాగుంటే మరి సినిమా ఇంకెంత బాగుంటుందని అంతా అనుకుంటున్నారు. పైగా చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే అడవి శేషు కి ఈ సినిమా ద్వారా ఎక్కువ రెమ్యునరేషన్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న అడవి శేషు కి నాని ఎక్కువ రెమ్యునరేషన్ ని ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇక పారితోషం విషయానికి వస్తే…. అడవి శేషు కి హిట్ సినిమా ద్వారా ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల రెమ్యూనిరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండవ తేదీన ఈ సినిమా భారీ స్థాయి లో విడుదల కాబోతోంది. సినిమా అయితే అదిరిపోయేలానే కనపడుతోంది. పైగా ఇప్పటికే ప్రేక్షకులు ఎక్స్పక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల వరకు ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.


You may also like

Leave a Comment