Ads
ఏ రంగంలో అయినా ఎదగాలి అంటే కష్టాలు తప్పవు. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు భరించి ఆ తర్వాత ఒక స్థాయికి చేరుకుంటారు. కష్టాలు, ఎదగడం ఇవన్నీ అంటే ముందుగా గుర్తొచ్చేది సినిమా ఇండస్ట్రీ.
Video Advertisement
సినిమా ఇండస్ట్రీకి రావడం చాలా పెద్ద విషయం అంటే, ఇండస్ట్రీలో ఒక గుర్తింపు సంపాదించుకోవడం, ఆ గుర్తింపు వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఇంకా కష్టమైన విషయం.
ఒక వేళ ఇవన్నీ భరించి, కష్టపడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత, వారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా వారి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే సినిమా ఇండస్ట్రీలో వారు ఒక శాశ్వతమైన భాగం అయిపోయినట్టే. ఇలా ఎదిగే క్రమంలో ఎంతో మంది ఎన్నో రకమైన విషాదకరమైన సంఘటనలు ఎదుర్కొన్నారు. అయినా కూడా వాటన్నింటినీ దాటుకొని వచ్చి ప్రేక్షకులని అలరించి ఒక స్థాయికి వచ్చాక ప్రపంచానికే దూరం అయ్యారు.
అలా చాలా సంవత్సరాల క్రితం ఇండస్ట్రీని ఏలిన నటి సిల్క్ స్మిత. కొంత మందికి ఈ పేరు వింటే ఆవిడ నటించిన సినిమాలు, పాటలు గుర్తుకు వస్తాయి. మరి కొంత మందికి ఆవిడ బయట ఎంత మంచి వ్యక్తి అనే విషయం గుర్తుకు వస్తుంది. ఏదేమైనా సరే సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన నటి సిల్క్ స్మిత. స్పెషల్ సాంగ్స్ అనే ఒక జోనర్ పాటలకే స్పెషాలిటీ తీసుకువచ్చారు. ఒక సమయంలో సిల్క్ స్మిత పాట ఉంటే సినిమా హిట్ అనే ఒక అభిప్రాయాన్ని ఏర్పడేలా చేశారు.
సినిమా ఇండస్ట్రీలో, అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో గుర్తుండిపోయే పాటలు సిల్క్ స్మిత నటించినవి అయ్యి ఉంటాయి. ఆవిడ పాట కోసమే, లేదా ఆవిడ నటిస్తే కేవలం ఆమె కోసమే సినిమాకి వెళ్ళిన వారు కూడా ఉండే ఉంటారు. అంత క్రేజ్ సంపాదించుకున్న సిల్క్ స్మిత నిజ జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదుర్కొన్నారు. ఎంతో మంది తనని మోసం చేశారు అని, నా అనుకున్న వాళ్లు కూడా తన డబ్బులు తీసేసుకొని తనని ఒంటరిదాన్ని చేశారు అని ఇలా చాలా రకమైన విషయాలు చెప్తూ ఉంటారు.
కానీ అసలు అక్కడ ఏం జరిగింది? సిల్క్ స్మిత ఎందుకు చనిపోయారు అనేది మాత్రం ఇప్పటికి కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే, అంత క్రేజ్ సంపాదించుకున్న సిల్క్ స్మిత వాడిన వస్తువులకు కూడా అభిమానులు ఉండేవారు. సిల్క్ స్మిత తిని పక్కన పెట్టిన యాపిల్ కూడా చాలా ఎక్కువ ధరకు తీసుకున్నారట. ఒక సారి షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత యాపిల్ తిన్నారు.
ఆ తింటున్న యాపిల్ ని షూటింగ్ లో ఉన్న ఒక వ్యక్తి 200 రూపాయలు ఇచ్చి తీసుకున్నాడట. అప్పట్లోనే 200 రూపాయలు అది కూడా ఒక యాపిల్ కోసం అంటే మామూలు విషయం కాదు. సిల్క్ స్మిత క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు సిల్క్ స్మిత అంటే జనాలకి ఎంత అభిమానం తెలిపే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ALSO READ : ప్రభాస్‌కి ఇవ్వడమే కానీ చేయి చాచి తిరిగి అడగడం తెలియదు: జగపతిబాబు
End of Article