టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి జగపతిబాబు. అప్పుడు హీరోగా చేసిన జగపతిబాబు ప్రస్తుతం విలన్‌గా చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ విలన్‌గా కొనసాగిస్తున్నాడు.

Video Advertisement

కేవలం సినిమాల్లో కాకుండా వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌తో పాటు రెండో ఇన్నింగ్స్‌ కూడా అదరగొడుతున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో హీరో ప్రభాస్‌, రాజమౌళి కుటుంబంపై పొగడ్తల వర్షం కురిపించాడు జగ్గుభాయ్. ఎన్నో హిట్‌లు సాధించిన రాజమౌళి మాత్రం సాధారణంగానే ఉంటాడు.

కేవలం రాజమౌళి మాత్రమే అలా కాదు.. వాళ్ల కుటుంబం మొత్తం కూడా అలానే ఉంటారని జగపతిబాబు ఓ ఇంటర్వూలో తెలిపారు. ఎన్ని అవార్డులు వచ్చిన వాళ్ల కుటుంబానికి గర్వం ఉండదు. అందుకే ఆస్కార్ వంటి అవార్డులు వరించాయని అతను తెలిపారు. రాజమౌళి కుటుంబంతో ఎక్కడికి వెళ్లినా సరే.. సినిమా గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు.

జగపతిబాబు రాజమౌళికి బంధువే అయిన పాత్రలు అడగలేను. బంధువే కదా అని ఛాన్స్ ఇచ్చే వ్యక్తి కూడా కాదని తెలిపారు. ఏ పాత్రకు ఎవరు సెట్ అవుతారో రాజమౌళికి బాగా తెలుసు. సినిమాల గురించి రాజమౌళి చాలా జాగ్రత్తగా ఉంటుంటారు. వీరి కుటుంబం నుంచి 20శాతం వరకు మిగతా వాళ్లు నేర్చుకోవచ్చని జగపతిబాబు తెలిపారు.

రెబల్ స్టార్ ప్రభాస్ చేయి చాచే రకం కాదు. తిరిగి ఇచ్చే రకం. కొన్ని సమస్యల వల్ల జగపతిబాబు డిప్రెషన్‌లోకి వెళ్లారు. ఆ సమయంలో ప్రభాస్‌కి ఫోన్ చేసి.. మాట్లాడాలని అడిగాను. తను జార్జియాలో ఉన్నాడు. అయిన ఏమాత్రం ఆలోచించకుండా నేను నీకున్నా.. నీ సమస్య చెప్పు డార్లింగ్ నేను తీరుస్తా అని ధైర్యం చెప్పాడు. జార్జియా నుంచి వచ్చిన వెంటనే నన్ను కలిసి నాకు ఓదార్పుగా ఉన్నాడు. వయస్సులో నా కంటే చిన్న అయిన గొప్పోడు, అందరితో ప్రేమగా ఉంటాడని జగపతిబాబు తెలిపాడు.