Ads
‘బబుల్‌గమ్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో నేచురల్ స్టార్ నాని పాల్గొని బబుల్‌గమ్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రాన్ని మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Video Advertisement
కృష్ణ అండ్ హిజ్ లీల, క్షణం చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ రవికాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీలో హీరోగా నటించిన అబ్బాయి తల్లితండ్రులు గురించి తెలియనివారు ఎవరు ఉండరు. మరి అబ్బాయి ఎవరో? అతని పేరెంట్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
పైన కనిపిస్తున్న అబ్బాయి పేరు రోషన్ కనకాల. అతను స్టార్ యాంకర్ సుమ, యాక్టర్ రాజీవ్ కనకాల కుమారుడు. వారి గురించి బుల్లితెర నుండి వెండి తెర ప్రేక్షకుల వరకు అందరికీ సుపరిచితులే. వారి తనయుడు రోషన్ కనకాల బబుల్‌గమ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. హీరోగా ఇదే మొదటి సినిమా అయినా, నటుడుగా రోషన్ కనకాల 2016 లో వచ్చిన నిర్మలా కాన్వెంట్ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో హీరో ఫ్రెండ్ భాషాగా నటించాడు.
ఆ తరువాత రోషన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. తన స్టడీ పూర్తి అవడంతో, తిరిగి వచ్చిన రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం శిక్షణ తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలో రవికాంత్ దర్శకత్వంలో బబుల్‌గమ్ మూవీలో నటించాడు. ఈ మూవీలో హీరోయిన్‍గా మానస చౌదరీ చేస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. హీరో నాని పాల్గొని మూవీయూనిట్ కు విషెస్ తెలిపారు. ఈ ఈవెంట్ కు హోస్ట్ గా సుమ, గెస్ట్ గా రాజీవ్ కనకాల పాల్గొని సందడి చేశారు. ఈవెంట్‌లో నాని సుమ, రోషన్ గురించి మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఈవెంట్‌లో హీరో రోషన్ కనకాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న హీరోలా మాట్లాడిన విధానం అందరినీ ఆకర్షించింది.
Also Read: 45 సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప సినిమా వచ్చిందా..? ఈ సినిమా చూశారా..?
End of Article