45 సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప సినిమా వచ్చిందా..? ఈ సినిమా చూశారా..?

45 సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప సినిమా వచ్చిందా..? ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

సూపర్ స్టార్ కృష్ణ సిల్వర్ స్క్రీన్ పై చేసిన సాహసాలు ఎన్నో ఉన్నాయి. 57 ఏళ్ల కెరీర్‌లో 350కిపైగా సినిమాలలో నటించిన కృష్ణ ఇండస్ట్రీలో చేసినన్ని ప్రయోగాలు, సాహసాలు మరే హీరో చేయలేదని చెప్పవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో కృష్ణ ట్రెండ్‌సెట్టర్‌ గా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Video Advertisement

నటశేఖర కృష్ణ నటించిన సినిమాలలో అప్పట్లోనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించిన సినిమా “ఏజెంట్ గోపి”. ఇప్పుడు వాడే స్మార్ట్ వాచ్, వాచ్ ఫోన్ వంటి వాటిని 1978 లోనే వాడారు. ఆ మూవీ గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్, జేమ్స్ బాండ్‌ అనగానే గుర్తుకువచ్చేది సూపర్ స్టార్ కృష్ణ. ఆయన పలు గుడాచారి సినిమాలలో నటించారు. వాటిలో ప్రత్యేకంగా నిలిచిన మూవీ ఏజెంట్ గోపి. ఈ సినిమాని లెజెండరీ డైరెక్టర్ కె.ఎస్.ఆర్.దాస్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్ గా నటించారు. కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, రాజనాల వంటి లెజెండరీ నటులు కీలకపాత్రలలో నటించారు. ఏజెంట్‌ గోపి మొదటి సినిమా స్కోప్‌ జేమ్స్ బాండ్‌ సినిమాగా నిలిచింది.
ఇక ఈమూవీ స్టోరీ విషయానికి వస్తే, గోపాల్ కృష్ణ అలియాస్ గోపి (ఘట్టమనేని కృష్ణ) ఒక తెలివైన పోలీస్ ఏజెంట్. 50 కోట్ల విలువైన వజ్రాల దొంగలను కనుగొనే క్రమంలో చాలా మంది పోలీసు అధికారులు చంపబడతారు. దాంతో  ఉన్నతాధికారి ఈ పనిని ఏజెంట్ గోపీకి అప్పగిస్తాడు. తనకు అప్పగించిన బాధ్యతలో భాగంగా గోపీ విశాఖపట్నం వెళ్తాడు. అక్కడ ఎస్ఐ రాజారావు (ప్రభాకర్ రెడ్డి) కలుస్తాడు. అతని చెల్లి పేరు లత(జయప్రద) అని తెలుస్తుంది.
లత గోపి ఉన్న హోటల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తుంది. అనుమానాస్పద రీతిలో వ్యవహరిస్తున్న గోపి గురించి తెలుసుకోవడం కోసం ప్రేమించినట్టుగా నటిస్తుంది. అయితే ఆమె గురించి తెలిసిన గోపి, లతను ఆమె అన్న రాజారావు దగ్గరకు గోపి తీసుకువెళతాడు. కానీ లత అది నిజం కాదని, రాజారావును నమ్మకూడదని అతను మోసగాడని చెప్తుంది. తన అన్నయ్య రాజారావును వజ్రాల కోసం స్మగ్లర్ల గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని చెప్తుంది.
ఆ తరువాత అసలైన రాజారావు స్మగ్లర్ల నుండి తప్పించుకుని వచ్చి, స్మగ్లర్ల గుహకు దారిచూపే మ్యాప్‌ను గోపికి ఇస్తాడు. లత, గోపి, అతని కొలీగ్ చిట్టి(పద్మనాభం) కలిసి గుహను కనుగొంటారు. అయితే వారిని స్మగ్లర్లు పట్టుకుంటారు. గోపి స్మగ్లర్ల డాన్ (రాజనాల)ని కలుస్తాడు. డాన్, అతని గ్యాంగ్ వజ్రాల కోసం ఇదంతా చేయడం లేదని, ప్రపంచ విధ్వంసం కోసం అని గోపి తెలుసుకుంటాడు. ఆ తరువాత గోపి, ఎస్‌ఐ రాజారావు, లత, చిట్టిల సహాయంతో స్మగ్లర్లను అంతం చేసి ప్రపంచాన్ని కాపాడుతాడు.
అప్పట్లో ఈ మూవీ చాలా పెద్ద హిట్. అసలు ఇలాంటి సినిమా అప్పుడు వచ్చిందంటే చాలా గొప్ప విషయం అని అంటున్నారు. కె.ఎస్.ఆర్.దాస్ అప్పట్లోనే అడ్వాన్స్ టెక్నాలజీకి చెందిన వాటిని ఈ సినిమాలో చూపించారు. హీరో అడివి శేష్ గూడాచారి2 మూవీలో ఏజెంట్ గోపికి నివాళిగా తన క్యారెక్టర్ ను రాసుకున్నారు.

Also Read: “ఫైట్ సీన్ లీక్ అయ్యింది..!” అనే పోస్ట్ కి… “సలార్ టీం” పెట్టిన రిప్లై చూస్తే నవ్వాపుకోలేరు..!

 


End of Article

You may also like