సినిమా టాక్ తో సంబంధం లేకుండా, వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ కి అంత పెద్ద చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. వచ్చిన ప్రతి సినిమా కూడా, ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ఆ అంచనాలని అందుకోలేకపోయింది.

Video Advertisement

ఇటీవల వచ్చిన ఆదిపురుష్ అయితే, సినిమా నచ్చలేదు అన్న సంగతి పక్కన పెడితే, అసలు మన దేవుళ్ళని, మన పురాణాలని తెలుసుకోకుండా సినిమా తీశారు అని ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభాస్ కూడా ఈ సినిమా తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ దృష్టి అంతా, సలార్ సినిమా మీద ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో, ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, విలన్ పాత్రలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. పృథ్వీరాజ్ తండ్రి పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

సినిమా 2 పార్ట్స్ లో రిలీజ్ అవుతుంది. మొదటి భాగం ఈ సంవత్సరం వస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 AD సినిమా మీద మొత్తం దృష్టి పెడతారు. అయితే, ఈ సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన సలార్ వాయిదా పడి డిసెంబర్ లో రిలీజ్ అవుతోంది. దీనికి కారణం సినిమాలోని కొన్ని సీన్స్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి నచ్చలేదు అనే వార్తలు వచ్చాయి. దాంతో అవి మళ్ళీ షూట్ చేస్తున్నారు.

Kalki-2898-AD-story

మరొక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. సినిమా బృందం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమాకి సంబంధించిన విషయాలు షేర్ చేయడం మాత్రమే కాకుండా, అభిమానుల ప్రశ్నలకి కూడా సమాధానాలు వాళ్ళ స్టైల్ లో ఇస్తారు. ఈ మధ్య కాలంలో లీక్స్ గొడవలు మరీ ఎక్కువ అయ్యాయి. దీంతో ఒక వ్యక్తి, “సలార్ సినిమా నుండి ఫైట్ సీన్ లీక్ అయ్యింది. ఎవరికి అయినా కావాలి అంటే, ఇది రీట్వీట్ చేయండి. అలాగే ఈ సీన్ కోసం నాకు మెసేజ్ చేయండి.” అని పెట్టి ఒక వీడియో షేర్ చేశాడు.

salaar team funny reply to a comment

ఇది సినిమా బృందం దృష్టికి కూడా వెళ్ళింది. దాంతో సలార్ టీం, “మాకు కూడా ఆ వీడియో DM చేయండి” అని పెట్టి, సలార్ లో ఎలివేషన్ ఇచ్చిన టీను ఆనంద్ ఫోటో పెట్టి ఆ వీడియో లీక్ చేసిన యూజర్ పోస్ట్ కి కామెంట్ పెట్టారు. అంతే కాకుండా కాపీరైట్ వేసి ఆ వీడియో కూడా డిలీట్ చేసేశారు. దాంతో, “డైనోసార్ తో అంత ఈజీ కాదు” అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : “బేబీ సినిమా నుండి నేర్చుకున్న నీతి ఏమైనా ఉందా..?” అనే ప్రశ్నకి… ఈ వ్యక్తి ఏం సమాధానం చెప్పారో తెలుసా..?