3 భాషల్లో రీమేక్… కానీ ఏ ఒక్కటి కూడా ఒరిజినల్‌కి సాటి రాలేదు..! ఈ సినిమా చూశారా..?

3 భాషల్లో రీమేక్… కానీ ఏ ఒక్కటి కూడా ఒరిజినల్‌కి సాటి రాలేదు..! ఈ సినిమా చూశారా..?

by Harika

Ads

రీమేక్ సినిమాలు సహజంగా అన్ని ఇండస్ట్రీలలో వస్తాయి. కానీ కొన్ని సినిమాలను రీమేక్ చేయడం అంటే సాహసం అని అనుకోవాలి. ఎందుకంటే, ఒరిజినల్ సినిమాలు క్రియేట్ చేసే ఇంపాక్ట్ అలాంటిది. అలాంటి సినిమాలని మళ్లీ రీమేక్ చేయడం అనేది కష్టం. అలాంటి ఒక సినిమా మూడు భాషల్లో రీమేక్ అయ్యింది. కానీ ఒక్క భాషలో కూడా ఒరిజినల్ సినిమా అంత మంచి టాక్ సంపాదించుకోలేకపోయింది. ఇప్పుడు అంటే బాలీవుడ్ వాళ్ళని తిడుతున్నారు కానీ కొంత కాలం క్రితం బాలీవుడ్ వాళ్లు మాస్టర్ పీస్ సినిమాలను ఇచ్చారు. అలాంటి ఒక మాస్టర్ పీస్ సినిమా ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన అంధాధున్. టబు, రాధిక ఆప్టే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

Video Advertisement

movie that had multiple remakes

ఈ సినిమాని తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేశారు. నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించారు. హిందీలో టబు పోషించిన పాత్రని తెలుగులో తమన్నా పోషించారు. రాధిక ఆప్టే పోషించిన పాత్రని నభా నటేష్ పోషించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఆకాష్ (ఆయుష్మాన్ ఖురానా) అనే ఒక వ్యక్తి గుడ్డివాడి లాగా నటిస్తూ ఉంటాడు. తన ఆర్ట్ కోసం అలా చేస్తున్నాను అని చెప్తాడు. ఆకాష్ పియానో వాయిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆకాష్ అనుకోకుండా సిమ్మి (టబు) తన భర్తని చంపడం చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. సినిమా కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా బాగా రాసుకున్నారు. అంతే బాగా తీశారు.

శ్రీరామ్ రాఘవన్ దీనికి దర్శకత్వం వహించారు. మూడు జాతీయ అవార్డులు కూడా ఈ సినిమా గెలుచుకుంది. తెలుగులో నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో సినిమా ఓటీటీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా హిందీలో ఉన్నదే ఉన్నట్టు తీశారు. మార్పులు ఏమీ చేయలేదు. అయినా కూడా హిందీ అంత పెద్దగా కాకుండా దీనికి కూడా మంచి టాక్ వచ్చింది. కానీ ఒరిజినల్ సినిమాని మాత్రం దాటలేకపోయింది. తమిళ్ లో ఈ సినిమాని ప్రశాంత్ హీరోగా రీమేక్ చేశారు. కానీ ఆ సినిమా ఇంకా విడుదల అవ్వలేదు. మలయాళంలో పృథ్వీరాజ్ హీరోగా భ్రమం పేరుతో రీమేక్ చేశారు.

ఈ సినిమా కూడా ఒరిజినల్ సినిమాని దాటలేకపోయింది. ఎవరికి వాళ్లు బాగానే చేసినా కూడా తెలుగు సినిమా మీద మాత్రం నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఒరిజినల్ హిందీ సినిమా ఇంకా సహజంగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. హిందీలో ఈ సినిమాకి బెస్ట్ హిందీ ఫిలిం, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ యాక్టర్ విభాగాల్లో నేషనల్ అవార్డులు వచ్చాయి. 2018 లో సినిమా విడుదల అయినప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప సినిమా అంటూ కామెంట్స్ చేశారు.

ALSO READ : జరగండి పాటలో ఈ మిస్టేక్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?


End of Article

You may also like