Ads
రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా బృందం కూడా చాలా యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. సినిమా తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతూ ఉండడంతో సినిమా బృందం అక్కడ కూడా ప్రమోషన్స్ చేస్తోంది.
Video Advertisement
సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ రేణు దేశాయ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇంత ప్రమోషన్స్ చేస్తున్నా కూడా కర్ణాటకలో, తమిళనాడులో సినిమాకి సరైన స్క్రీన్స్ దొరకట్లేదు. అదే విజయ్ హీరోగా నటించిన లియో సినిమాకి తెలుగులో దాదాపు ఒక తెలుగు సినిమాకి ఇచ్చిన అన్ని స్క్రీన్స్ ఇస్తున్నారు. ఈ సినిమాకి ఇప్పటివరకు ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కూడా లేదు. ఈ రెండు సినిమాలు ఒకటే టైంలో రిలీజ్ అవుతున్నాయి. కానీ ఒక సినిమాకి అంత ప్రాముఖ్యత ఇచ్చి, ఇంత కష్టపడి ప్రమోట్ చేస్తున్న సినిమా అని అసలు పట్టించుకోకపోవడం గమనార్హం.
దాంతో ఈ విషయం మీద తెలుగు ప్రేక్షకులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మేము ఏమో ప్రతి సినిమాని మా సినిమా అని ఆదరిస్తూ ఉంటే, అక్కడ వాళ్ళు అంత పెద్ద హీరో సినిమాని పట్టించుకోకపోవడం ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, కంటెంట్ బాగుంటే సినిమా ఏదో ఒక రకంగా హిట్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాకి కూడా అలాగే జరుగుతుంది అని ఆశిస్తున్నారు. అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా సెన్సార్ ఇటీవల పూర్తి అయ్యింది.
ఈ సినిమాకి యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. కొన్ని కట్స్ కూడా ఇచ్చారు. మరీ ఫైటింగ్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సీన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పినట్టు సమాచారం. సినిమా టాక్ విషయానికి వస్తే సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయట. కొత్త సబ్జెక్ట్, ఒక డిఫరెంట్ స్టైల్ టేకింగ్ తో సినిమా నడుస్తుంది. అది కూడా నిజ జీవిత సంఘటన కాబట్టి ప్రేక్షకులకు ఇంకా ఆసక్తి పెరిగి సినిమాకి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ సినిమా నిడివి విషయంలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ కాలంలో ఇంత టైం ఉన్న సినిమా లేదు ఏమో.
సినిమా మొత్తంగా 3 గంటలు 2 నిమిషాలు ఉందట. ఈ టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి గురించి ఎంత చెప్పినా సరిపోదు అని, కానీ సెకండ్ పార్ట్ కాకుండా ఒక్క సినిమాతోనే మొత్తం చెప్పాలి అని నిర్ణయించుకున్నారు అని, అందుకే సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉన్నా పర్వాలేదు ఇందులోనే సినిమా ఫినిష్ చేద్దాం అనుకున్నారు అని సమాచారం.
సాధారణంగా ఇంత నిడివి అంటే ప్రేక్షకులు ఆలోచిస్తారు. కానీ సినిమాలో ఎంత నిడివి ఉన్నా కూడా, అంత సేపు ప్రేక్షకులని కూర్చోబెట్టగలిగే సత్తా కథలో ఉంటే, అంత పెద్ద సినిమా అయినా చూస్తారు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలా అనిపిస్తుందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే అంత వరకు ఆగాల్సిందే.
ALSO READ : ఓటీటీలోకి “స్కంద” మూవీ..! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
End of Article