ఎనర్జిటిక్ స్టార్, రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా స్కంద. ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 28న గ్రాండ్ గా విడుదల అయ్యింది.

Video Advertisement

ఈ మూవీ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేక, మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నెట్టింట్లో ఈ మూవీ పై ట్రోలింగ్ కూడా జరిగింది. దాంతో ఆశించిన రేంజ్ లో వసూళ్లు సాధించలేకపోయింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్కంద మూవీలో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ, పృథ్వీరాజ్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్కంద మూవీని దర్శకుడు బోయపాటి శ్రీను తన మార్క్ కంప్లీట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి.
skanda movie reviewహీరో రామ్ పోతినేని మాస్ మరియు యాక్షన్ లుక్‍తో ఆకట్టుకున్నారు. రామ్, శ్రీలీల డ్యాన్స్ మూవీలో హైలైట్‍గా నిలిచింది. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయని టాక్. రివ్యూలు కూడా మిశ్రమంగా రావడంతో  స్కంద మూవీ ఆశించిన రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ను వసూల్ చేయలేకపోయిందని తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే స్కంద మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‍స్టార్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 27 నుండి ఈ మూవీ డిస్నీ+ హాట్‍స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్‍కు కానుందని సమాచారం. అయితే ఈ విషయం పై డిస్నీ+ హాట్‍స్టార్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: ప్రభాస్ “రాఘవేంద్ర” మూవీలో ఈ సీన్ చూశారా..? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా..?