ప్రభాస్ “రాఘవేంద్ర” మూవీలో ఈ సీన్ చూశారా..? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా..?

ప్రభాస్ “రాఘవేంద్ర” మూవీలో ఈ సీన్ చూశారా..? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా..?

by kavitha

Ads

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. సలార్, కల్కి వంటి చిత్రాలలో పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది.

Video Advertisement

ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఒక డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ సినిమా మరియు డైలాగ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
స్టార్ హీరోల సినిమాలలో వారి నటన, ఫైట్స్, డ్యాన్స్ లతో పాటుగా వారు చెప్పే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను, ముఖ్యంగా అభిమానులను అలరిస్తాయి. ఒక సినిమాలోని డైలాగ్ ను మరో సినిమాలో అది కూడా ఒక స్టార్ హీరో చెప్పినప్పుడు ఆ డైలాగ్ ఆడియెన్స్ కు మరింతగా గుర్తుంటుంది. ఒకప్పుడు అంతగా పట్టించుకునేవారు కాదు. తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉండేది కాదు.
కానీ ఓటీటీలు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత గతంలో వచ్చిన సినిమాలను చూడడం, అవి ఆ తరువాత వచ్చిన చిత్రాలలో చూసినట్టుగా అనిపించగానే, ఆ వీడియోని సోషల మీడియాలో షేర్ చేయడం సాధారణం అయిపోయింది. ఇలాంటి వీడియోని ఒక యూజర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రభాస్ నటించిన రాఘవేంద్ర మూవీలోని డైలాగ్ కు సంబంధించిన వీడియో అది.
ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక యూజర్ రాఘవేంద్ర సినిమాలోని ఒక వీడియో క్లిప్ ను షేర్ చేశారు. ఆ వీడియోలో మురళీమోహన్ ఒక వ్యక్తితో “కరెంట్ తీగ చూడడానికి మామలుగానే ఉంటుంది. ఒక్కసారి దానిమీద చెయ్యి వేస్తే తెలుస్తుంది దాని పవర్ ఏమిటో” అంటూ చెప్తాడు. ఈ మూవీ 2003 లో రిలీజ్ అయ్యింది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కూడా కాస్త అటు ఇటుగా ఇలానే ఉంటుంది. ఈ డైలాగ్ పాపులర్ అయ్యింది. ఈ మూవీ 2011 లో రిలీజ్ అయ్యింది. రాఘవేంద్ర మూవీ నుండి కాపీ చేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CyKXYyhpOA1/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: ఈ అబ్బాయి తల్లితండ్రులు తెలియని తెలుగు వారు ఉండరు ఏమో..? ఎవరంటే..?

 


End of Article

You may also like