Ads
ప్రియాంక గాంధీ గురించి దేశమంతా తెలిసిన విషయమే… ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె…. రాహుల్ గాంధీకి చెల్లెలు… ప్రియాంక గాంధీ గతంలో రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోయినా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో ప్రచారాలు చేస్తున్నారు.
Video Advertisement
తల్లి సోనియా గాంధీ వారసత్వ లక్షణాలను పునికి పుచ్చుకున్నట్లు తన తీరు ఉంటుంది. ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రాను ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే… వాళ్ల లవ్ స్టోరీ పైన ఫుల్ డీటెయిల్స్ మీకోసం…
రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ కు చెందిన వ్యక్తి. రాబర్ట్ వాద్రా తండ్రి రాజేష్ వాద్రా బ్రిటిష్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రాబర్ట్ వాద్రా చెల్లెలు మిచెల్ వాద్రా ప్రియాంక గాంధీ చదువుతున్న స్కూల్లోనే చదివేది. అతన చెల్లెలి ద్వారా ప్రియాంక గాంధీని రాబర్ట్ వాద్రా మొదటిసారి కలిశాడు. అది 1991-92 సమయం అప్పటికి ప్రియాంక గాంధీ వయసు 13 సంవత్సరాలు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీకి అండగా ఉండేవాడు.
వాద్రా ఫ్యామిలీ ఆర్టిఫిషియల్ జువెలరీ బిజినెస్ లో ఉండేవారు. రాబర్ట్ వాద్రా అప్పుడప్పుడు ప్రియాంక గాంధీకి ఆకర్షణీయమైన జువెలరీ గిఫ్ట్ లు ఇస్తూ ఉండేవాడు. కాలక్రమేన ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. రాబర్ట్ వాద్రా తరచుగా 10 జన్ పత్ కు వస్తూ ఉండేవారు. అలా రాహుల్ గాంధీకి కూడా సన్నిహితుడుగా మారారు. ఒకసారి ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రానీ చూడడానికి మెరదాబాద్ వెళ్ళినప్పుడు వీళ్ళ గురించి మీడియా ద్వారా బయటికి వచ్చింది.
ప్రియాంక రాబర్ట్ స్నేహానికి కారణమైన మిచెల్ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. రాబర్ట్ తండ్రి కూడా ఆ-త్మ-హ-త్య చేసుకుని చనిపోయాడు. తర్వాత అతని అన్న కూడా మరణించాడు. తర్వాత రాబర్ట్ తల్లి మాత్రమే వాద్రా ఫ్యామిలీలో మిగిలి ఉంది. తర్వాత ప్రియాంక గాంధీ కుటుంబం రాజకీయంగా దేశంలో మరింత బలపడింది. ప్రియాంక గాంధీ చుట్టూ ఎస్పిజి సెక్యూరిటీ బలగాలు ఉండేవి. ప్రియాంక గాంధీతో మాట్లాడడానికి కష్టంగా ఉండే రోజుల్లో తనకి ప్రపోజ్ చేయడం అంటే అయ్యే పనే కాదు.
రాబర్ట్ వాద్రా అదృష్టం కొద్దీ ప్రియాంక గాంధీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో ధైర్యంగా ప్రియాంక గాంధీకి ప్రపోజ్ చేశాడు. ప్రేమించమనో లేదా గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని కాదు, పెళ్లి చేసుకోమని అడిగాడు. ప్రియాంక గాంధీ వెంటనే అతని ప్రపోజల్ ఒప్పుకుంది. రాహుల్ గాంధీ కూడా రాబర్ట్ కి స్నేహితుడు కావడంతో పెద్దగా ఇబ్బంది లేదు. సోనియా గాంధీ కూడా వీళ్ళ పెళ్లికి ఎటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు.
ఇంటిలిజెన్స్ బ్యూరో రాబర్ట్ వాద్రా గురించి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేసి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1997 సంవత్సరంలో వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. వీరికి ఇద్దరు కుమారుల సంతానం. రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ ఇద్దరూ గుర్గావ్ లో నివాసం ఉంటారు. వీళ్ళ పెళ్లి జరిగి 17 సంవత్సరాలు అయినా వీరి బంధంలో ఎటువంటి మార్పు రాలేదు. రాబర్ట్ వాద్రా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ కావడంతోనే తాను ఇష్టపడినట్లు ప్రియాంక గాంధీ తెలిపారు.
Also Read:చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అప్‌డేట్ ఇదే…
End of Article