సైడ్ డాన్సర్ గా కెరీర్ మొదలు… నమ్మిన వాళ్ల చేతిలోనే మోసం..! “సూర్యకాంతం” కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

సైడ్ డాన్సర్ గా కెరీర్ మొదలు… నమ్మిన వాళ్ల చేతిలోనే మోసం..! “సూర్యకాంతం” కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

by Mounika Singaluri

Ads

పాత సినిమాల్లో కోడలిని హింస పెట్టాలి అంటే ఆవిడను మించిన అత్తగారు మరొకరు లేరు. భర్త నోరు ఎలా? కూతురును అల్లారు ముద్దుగా ఎలా పెంచాలి?ఇంటి అల్లుడిని ఎలా ఆడుకోవాలి? ఇవన్నీ తెలుసుకోవాలంటే పాత సినిమాల్లో సూర్యకాంతం చేసిన పాత్రలు చూస్తే సరిపోతుంది. అందుకే సూర్యకాంతం పేరు వింటే ఎవరికైనా సరే వణుకు పుడుతుంది. అమ్మో సూర్యకాంతం అని అనక మానరు

Video Advertisement

. ఎవరైనా సరే బయట గయ్యాలి ఇలా ఉంటే సూర్యకాంతంలా ఉన్నావే అని పోలుస్తారు. ఆమెను అంతలా తిట్టుకుంటున్నారంటే ఆమె ఎంత అందంగా నటించకపోతే ఈ రోజు అలా గుర్తు పెట్టుకుంటారు.అటువంటి అద్భుత నటి శతజయంతి నేడు. అక్టోబర్ 28 నాటికి సూర్యకాంతం పుట్టి 100 ఏళ్ళు అవుతుంది.

కానీ నిజీవితంలో ఆమె మాటలు వింటే ఎవరైనా సరే తరుక్కుపోతారు. “ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుంది అంటే ఆ సంతోషమే నాకు వద్దు” అని ఆమె అన్నారు. నటి గయ్యాళితనాన్ని కనబరిచిన ఆమె వ్యక్తిగా కాస్త సున్నిత మనస్సుకురాలే. నిజానికి కథానాయక వెండితెరపై అందంగా సున్నితంగా కనిపించాలన్నది సూర్యకాంతం కల.అటువంటి ఛాన్స్ తనకు వచ్చినప్పటికీ ఒక హీరోయిన్ చేజర్చుకున్న అవకాశాన్ని తాను అందిపుచ్చుకొని ఆనందపడడానికి ఇష్టపడక దాన్ని తిరస్కరించారు. ఇక వెండితెరపై ఎడమ చెయ్యిని ఆడిస్తూ విసురుగా ఆమె చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేసేవారు.

సూర్యకాంతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉన్న వెంకటకృష్ణ రాయపురం. 1924 అక్టోబర్ 28న పొన్నాడ అనంతరామయ్య-వెంకటరత్నం లకు జన్మించారు. చిన్నప్పటినుండి సూర్యకాంతం అబ్బాయిలాగా బట్టలు వేసుకుని చలాకీగా ఉండేవారట. తల్లిదండ్రులు సూర్యం అని పిలిచేవారు అంట. ఆమెకి ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి చనిపోయారు. అప్పటికే ఆమె తోబుట్టువులకు పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోయారు. సూర్యం ఆమె తల్లి మాత్రమే ఉండేవారు. అప్పట్లో కాకినాడలో అందరూ అమ్మాయిలే ఉన్న ఒక డ్రామా కంపెనీని నిర్వహించేవారు బాలాంతరపు ప్రభాకర్ రావు.

నటించాలని ఆసక్తి ఉన్న అవకాశం కోసం అడగడానికి ఇష్టపడలేదు. అయితే ఒక అమ్మాయి రాకపోవడంతో ఆ పాత్రకి చలాకి సూర్యాన్ని తీసుకున్నారు ప్రభాకర్ రావు. తల్లి కూడా ఎప్పుడు అడ్డు చెప్పలేదు. అలా సతీసక్కుబాయి నాటకంలో మగపిల్లాడి వేషం వేసింది సూర్యం. ఆ తర్వాత రంగస్థలం పైన నిరూపించుకుని హనుమాన్ రాంబాబు కంపెనీ నాటకాలలో నటించింది. ఆ డ్రామా కంపెనీ మద్రాసులో నాటకాలు వేస్తుంటే కూతురితో సహా తల్లి చిన్న పట్నం చేరుకున్నారు. అప్పటికి సూర్యం వయసు 20 ఇక సినిమాలో నటిస్తానంటే తల్లి ఓకే అన్నారు.

జెమినీ స్టూడియోలో ఓ సినిమాలో సూర్యకాంతంకి సైడ్ డాన్సర్ గా అవకాశం వచ్చింది. నెలకి 60 జీతం అంటే ఒప్పుకోలేదు ఆమె. దాంతో 75 ఇవ్వడానికి అంగీకరించారు. తర్వాత జెమినీ నుండి బయటకు వచ్చేసి నారద-నారదీ అనే తొలి చిత్రంలో నటించారు. సౌదామని చిత్రంతో హీరోయిన్ అవకాశం వచ్చింది.అయితే కారు ప్రమాదం వల్ల మొఖానికి గాయం కావడంతో ఆ అవకాశం చేజారింది. కాస్త కోరుకున్నాక సంసారం చిత్రంలో గయ్యాళి అత్త పాత్రకు వస్తే కాదనకుండా ఒప్పుకున్నారు. తర్వాత గయ్యాళి అత్త అంటే సూర్యకాంతమే అన్నంతగా నటించడంతో కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

40 ఏళ్లలో దాదాపు 700 చిత్రాలు నటించారు. సూర్యకాంతం కెరీర్ లో గుండమ్మ కథ చిత్రం ముందుంటుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలు ఉన్నప్పటికీ సూర్యాకాంతం వీలైనంత గయ్యాలి తనం ప్రదర్శిస్తారని నమ్మకంతోటే ఆమె పాత్ర వచ్చేటట్లు టైటిల్ పెట్టారు. ఇంకా ఆమె చేసిన చిత్రాలు చక్రపాణి, దొంగ రాముడు, చిరంజీవిలు, తోడికోడళ్ళు,కుల గోత్రాలు, దాగుడుమూతలు, ఉమ్మడి కుటుంబం, దసరా బుల్లోడు లాంటి చిత్రాలు ఉన్నాయి. రచనమైన ఆసక్తితో ఒక వంటల పుస్తకాన్ని కూడా రాసి ఆమె ప్రచురించారు.

సూర్యకాంతం ఆర్థిక లావాదేవీల విషయంలో నెక్కొచ్చుగా ఉండేవారట అలాగే సులువుగా ఎవరిని నమ్మేవారు కాదు చివరికి కారు పాడైతే మెకానిక్ ఇంటికి వచ్చి తన కళ్ళు ముందే బాగు చేయాలంట సెకండ్ హ్యాండ్ కార్లు కొని అమ్మేవారు. అయితే ఎంత తెలివైన వారైనా ఎక్కడ ఒకచోట మోసపోతారు అన్నట్టు నమ్మిన వాళ్లే ఆమెను మోసం చేశారు. అత్త పాత్రలో ఆమెను రీప్లేస్ చేసేవారు మరొకరు రారు.

Also Read:భార్యతో కలిసి “పవన్ కళ్యాణ్” ఇటలీ ఎందుకు వెళ్తున్నారు..? కారణం ఏంటంటే..?


End of Article

You may also like