పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు పక్క రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎప్పుడో గాని పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు బయటకు రావు. ఎప్పుడైనా తన పిల్లలతోటి భార్యతోటి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలిసి దిగిన ఫోటోలు బయట హల్చల్ చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా తన భార్య అన్నా లెజెనోవా కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఇద్దరు కలిసి ఇటలీ వెళుతున్నట్లు సమాచారం.

Video Advertisement

దీని వెనకాల అసలు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ ఒకటో తారీఖున ఇటలీలో జరగనున్న సంగతి తెలిసింది. అయితే ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఆగమేఘాల మీద చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీ అంతా కూడా ఇటలీకి పైనమయ్యారు. ఇప్పటికే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వరుణ్ తేజ్-లావణ్యలు ఇటలీలో ఉన్నారు.చాలా కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్యలో మాత్రమే వివాహం జరగనుంది. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇటలీకి పైనమయ్యారు. తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సినిమాలకి కొద్ది రోజులు విరామం ఇచ్చి తన భార్యతో కలిసి ఇటలీకి వెళుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన ఫంక్షన్లు తప్పితే మిగతా వాటికి హాజరుకారు. ఇప్పుడు తన ఇంట్లో పెళ్లి సందడి కావడం చేత కుటుంబ సమేతంగా ఈ పెళ్లికి హాజరవుతున్నారు.మెగాస్టార్ చిరంజీవి దంపతులు రామ్ చరణ్ దంపతులు అల్లు అర్జున్ దంపతులు అందరూ కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారు. అయితే రిసెప్షన్ మాత్రం హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ గా చేయనున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్ కి రాజకీయ సినీ ప్రముఖులందరూ హాజరుకానున్నారు.

watch video :

Also Read:ఎన్నో అవార్డులు గెలుచుకొని ఇప్పుడు రిలీజ్ అయ్యింది..! ఈ సినిమా చూశారా..?