“వరుణ్ తేజ్-లావణ్య” పెళ్లిలో ఈ విషయానికి హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్..! అది ఏంటంటే..?

“వరుణ్ తేజ్-లావణ్య” పెళ్లిలో ఈ విషయానికి హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్..! అది ఏంటంటే..?

by Mounika Singaluri

Ads

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ ఒకటో తారీఖున ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి పైనమయ్యారు. మూడు రోజులు పాటు జరిగే ఈవెంట్ లో అందరూ సరదాగా గడపనున్నారు. హల్దీ ఫంక్షన్, వెడ్డింగ్ సెర్మని, మెహందీ ఫంక్షన్ అంటూ ఈవెంట్లను చేయనున్నారు.

Video Advertisement

ఇప్పటికే ఇటలీలో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న లావణ్య-వరుణ్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి పెళ్లి కారణంగా మూడు సినిమాలు ఆగిపోయాయి అన్న వార్త వినిపిస్తుంది. అసలు ఏంటా సినిమాలు? ఎందుకు ఆగాయి?

mega fans tensed about gamechanger movie..!!

వరుణ్ తేజ్ పెళ్లి కారణంగా రామ్ చరణ్ ఇటలీ వెళ్ళాడు. వారం రోజులపాటు అక్కడే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. అయితే  నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ షూటింగ్ కూడా ఇదే టైంలో జరగాల్సి ఉంది కానీ చరణ్ లేకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ అయింది. శంకర్ కూడా ఇండియన్ 2 షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చి గేమ్ చేంజర్ షుటింగ్ కోసం హైదరాబాద్ రావాలని అనుకున్నాడు. రామ్ చరణ్ లేని కారణంగా గేమ్ చేంజెర్ మరో నెల రోజులు లేట్ అవుతుంది.

ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప2 సినిమాకి బ్రేక్ ఇచ్చి వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్ళాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అల్లు అర్జున్ లేని కారణంగా వాయిదా పడింది.ఇక పవన్ కళ్యాణ్ కూడా తన కుటుంబంతో ఇటలీలోనే ఉండగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా కూడా బ్రేక్ పడినట్లు సమాచారం.మళ్లీ వీరందరూ పెళ్లి తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చాకే షూటింగు ప్రారంభం కానున్నాయి.

Also Read: OG సినిమాలో ఇంకో హీరోనా… ఎవరతను?


End of Article

You may also like