పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ OG. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ మూవీస్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. తమిళనాడు అర్జున్ దాస్, సియా రెడ్డి కీలకపాత్రలో కనిపించనున్నారు.

Video Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలవుతున్న వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ స్టిల్స్, టీజర్ అయితే విపరీతమైన హైప్ సంపాదించుకున్నాయి. పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారో అలా చూపిస్తున్నాను అని డైరెక్టర్ సుజిత్ తెలిపారు. డైరెక్టర్ సుజిత్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హార్డ్ కోర్ ఫ్యాన్.

ఈ సినిమాని ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లుగా సమాచారం. అయితే తాజగా ఈ సినిమా నుండి మరొక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మరొక హీరో నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరా హీరో అంటే… సీతారాముల కళ్యాణం తో హీరోగా ఎంట్రీ ఇచ్చి చిరంజీవి అన్నయ్య సినిమాలో తమ్ముడి క్యారెక్టర్ లో నటించిన వెంకట్, పవన్ కళ్యాణ్ OG సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేశారు.

ఈ పాత్ర పై వెంకట్ మాట్లాడుతూ ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్ ముగిసిందని, తన పాత్ర చాలా బాగా వచ్చిందని భోజీ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అన్నారు. తన క్యారెక్టర్ గురించి అన్ని విషయాలు ఇప్పుడే రివీల్ చేయనని అన్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ని చూడని విధంగా ఈ సినిమాలో చూడబోతున్నట్లు తెలిపారు. వెంకట్ ఇచ్చిన అప్డేట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు.

Also Read:రీ-రిలీజ్ లలో కొత్త ట్రెండ్ మొదలు పెట్టిన అల్లు అరవింద్..! ఇంతకీ అదేంటో తెలుసా..?