Ads
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన చిత్రం స్కంద. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ నెలాఖరుని విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. బోయపాటి సినిమా అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో అభిమానులు థియేటర్ కి వస్తారు.
Video Advertisement
బోయపాటి ముందు సినిమా కూడా ఆఖండా సెన్సేషనల్ విజయం సాధించింది. అఖండ సినిమా ఇప్పటికీ కూడా బోయపాటేన తీసింది అనిపిస్తుంది. ఆ సినిమాకి తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రాణం పోసింది.
అయితే అదే కాంబినేషన్ లో రామ్ హీరోగా వచ్చిన స్కందా చిత్రం మాత్రం ఫ్లాప్ టాక్ ను మూట కట్టుకుంది. స్కంద చిత్రం మీద ముందు నుంచి భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టరు టీజర్ వంటివి సినిమా మీద మంచి ఆసక్తి కలిగించాయి. అయితే సినిమా రిలీజ్ ముందు ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ అన్ని తలకిందులయ్యాయి. చాలామంది అభిమానులు ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే ఊహించారు.
ఊహించినట్టే ఈ సినిమా రిలీజ్ రోజు నుండే డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి మైనస్ గా చెప్పుకున్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ కి బోయపాటికి వివాదం కూడా నడిచిన సంగతి తెలిసిందే. ఒకరి మీద ఒకరు ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసుకున్నారు.అయితే ఇప్పుడు స్కంద సినిమా ఓటిలో రిలీజ్ అయిన తర్వాత చూసిన చాలామంది ఈ సినిమాలో చాలా మిస్టేక్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఓయ్ బోయపాటి ఈ మాత్రం చూసుకోవద్దా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఒక సీన్ లో రామ్ విలన్ వద్దకు వెళ్లి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఒకతను ముందుకు వచ్చి రామ్ ని గన్ తో బెదిరిస్తే అదే గన్ తో రామ్ అతన్ని కాల్చేస్తాడు. వెంటనే రౌడీ గ్యాంగ్ రామ్ కాల్చేయడంతో భయపడతారు. ఇక్కడ భారీ మిస్టేక్ ఏంటంటే రామ్ కాల్చేసిన అతను వెంటనే రౌడీ గ్యాంగ్ వెనకాల కూడా ఉంటాడు. ఇంత పెద్ద మిస్టేక్ ను బోయపాటి ఎలా మర్చిపోయాడు చూసుకోవద్దా అంటూ నవ్వుతున్నారు.
Watch Video:
https://www.instagram.com/reel/CzJgsVfvIut/?igshid=NjZiM2M3MzIxNA==
Also Read:“సద్గురు” భార్య ఎవరో తెలుసా..? ఆవిడ ఎలా చనిపోయారు..?
End of Article