వరుణ్ తేజ్-లావణ్యలకు కాస్ట్ లీ గిఫ్ట్ లు ఇచ్చిన చిరంజీవి – పవన్ కళ్యాణ్…ఏంటంటే.?

వరుణ్ తేజ్-లావణ్యలకు కాస్ట్ లీ గిఫ్ట్ లు ఇచ్చిన చిరంజీవి – పవన్ కళ్యాణ్…ఏంటంటే.?

by Mounika Singaluri

Ads

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని నవంబర్ ఒకటో తారీఖున ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మెగా కుటుంబ సభ్యుల మధ్యన వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి చిరంజీవి-సురేఖ, పవన్ కళ్యాణ్-అన్నా, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ సాయి ధరమ్ తేజ్, నిహారిక, వైష్ణవ తేజ్, అల్లు శిరష్ ఇలా మెగా హీరోలు అందరూ హాజరయ్యారు.

Video Advertisement

ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఉన్న ఫోటోలు చూసి నాకు అభిమానులు ఆనందానికి అవధులు లేవు.

తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటైన కొత్తజంటకు చిరంజీవి పవన్ కళ్యాణ్ ను స్పెషల్ గిఫ్ట్ లు ఇచ్చినట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి అయితే తన తమ్ముడి కొడుకు వరుణ్ తేజ్ కొత్తగా వివాహ బంధంలో అడుగుపెట్టిన సందర్భంగా తనవంతు బహుమతిగా వరుణ్ తేజ్ లావణ్యలకు రెండు కోట్లు చేసే డైమండ్ సెట్ ని బహుమతిగా ఇచ్చారు. ఒక జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లావణ్య త్రిపాటికి కార్ లు అంటే ఇష్టమని తెలుసుకొని ఆమెకు ఒక కాస్ట్ లి కారును గిఫ్ట్ గా ఇచ్చారు. దాని విలువ సుమారు కోటి రూపాయలుగా ఉంటుందని చెబుతున్నారు. ఈ గిఫ్ట్ చూసి వరుణ్ తేజ్ లావణ్యలు సర్ప్రైజ్ అయ్యారట.

ఇదిలా ఉంటే నవంబర్ ఐదో తారీఖున హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వరుణ్ తేజ్ లావణ్య రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ ప్రముఖులందరూ హాజరుకానున్నారు. ఏది ఏమైనా మెగా ఇంట పెళ్లి వేడుక ఇప్పుడు ఎక్కడ చూసినా సందడిగా మారింది.ఈ పెళ్లి వేడుకకు సుమారు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

 

Also Read:స్కంద” మూవీలో “రామ్ పోతినేని” కి డూప్ గా నటించిన ఆ సెలబ్రిటీ ఎవరో తెలుసా..?


End of Article

You may also like