“స్కంద” మూవీలో “రామ్ పోతినేని” కి డూప్ గా నటించిన ఆ సెలబ్రిటీ ఎవరో తెలుసా..?

“స్కంద” మూవీలో “రామ్ పోతినేని” కి డూప్ గా నటించిన ఆ సెలబ్రిటీ ఎవరో తెలుసా..?

by Mounika Singaluri

Ads

ప్రముఖ కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా వచ్చిన చిత్రం స్కంద. సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. ముందు నుంచి ఈ చిత్రం మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కానీ వాటిని అందుకోవడంలో బోయపాటి శ్రీను విఫలమయ్యాడు.

Video Advertisement

స్కంద సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఎవరూ ఊహించిన విధంగా ఓటీటీ లో ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. విడుదలైన 24 గంటల్లోనే రికార్డును నమోదు చేసింది. అయితే ఈ సినిమాలో చాలా సీన్లు లాజిక్ కి అందకుండా ఉన్నాయని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే పలు సోషల్ మీడియా పేజీల్లో బోయపాటి ఈ మాత్రం చూసుకోవద్దా అంటూ స్క్రీన్ షాట్లు తీసి మరి ఎగతాళి చేస్తున్నారు.

అయితే తాజాగా స్కంద సినిమాలో రామ్ కి డూప్ గా నటించింది ఎవరో తెలుసా అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రతి సినిమాలోనూ కొన్ని సీన్లలో హీరోలకి డూపులు నటిస్తారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరో అవసరంలేని సీన్లలో డూపులను పెట్టి డైరెక్టర్ మేనేజ్ చేసేస్తూ ఉంటారు.అయితే స్కంద సినిమాలో ఒక ఫైట్ సీన్ లో రౌడీలను హారతి గుత్తితో పొడిచే సీన్ లో రామ్ కి డూప్ గా నటించింది ఎవరో తెలిసిపోయింది. అది సినిమా టీం చెబితేనో లేక డూప్ గా నటించిన వ్యక్తి బయటికి వచ్చి చెబితేనో తెలిసింది కాదు. ఇప్పటికే చెప్పాం కదా స్కంద సినిమాలో చాలా తప్పులు ఉన్నాయని, అలాంటి తప్పు ద్వారానే ఈ విషయం కూడా బయటికి వచ్చింది.

బోయపాటి సినిమాలో ఫైట్లు అన్ని కూడా స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా ఉంటాయి. అయితే ఈ ఫైట్ సీన్ లో స్లో మోషన్ లో చూసినప్పుడు ఎడిటింగ్ మిస్టేక్ వల్ల డూపు మొహం కనిపించిపోయింది. ఇంతకీ ఎవరు ఆ డూపుగా నటించింది అనుకుంటున్నారా. ఇంకెవరో కాదు మన డైరెక్టర్ బోయపాటి శ్రీను. డూపును పెట్టడం వేస్ట్ అనుకున్నాడో లేక తాను చేస్తేనే బెస్ట్ అనుకున్నాడో కానీ రామ్ బదులు బోయపాటి శీను ఫైట్ సీన్ చేసేసాడు. ఇది స్లో మోషన్ లో చూసిన ఎవరికైనా దొరికిపోతుంది. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది స్పందన ఎందుకు డివైడ్ టాకు తెచ్చుకుంది అని. ఇలాంటి చిన్న చిన్న విషయాలను బోయపాటి లాంటి సీనియర్ డైరెక్టర్ పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Also Read:“కమల్ హాసన్” కంటే ముందే… “బాలకృష్ణ” ఈ సీన్ చేశారా..? ఏ సినిమాలో అంటే..?


End of Article

You may also like