తమిళ్ హీరో కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు తమిళంలో రికార్డు కలెక్షన్స్ సంపాదించింది. ఈ సినిమా తోటే డైరెక్టర్ లోకేష్ కనగరాజు LCU కాన్సెప్ట్ ని తీసుకువచ్చారు.

Video Advertisement

ఈ సినిమాలో గోస్ట్ గా కమల్ హాసన్ చేసిన పాత్ర ఆడియన్స్ కి ఫుల్ కిక్కించింది. వరుస పెట్టి ఫ్లాపుల్లో సతమతమవుతున్న కమలహాసన్ కి విక్రమ్ సినిమా ఊపిరి పోసిందని అనాలి.విక్రమ్ సినిమాలో వచ్చే ట్విస్టులు ఒక్కొక్కటి థ్రిల్ చేస్తూ ఉంటాయి.

ఈ సినిమాలో కమల్ హాసన్ వంటింటి లో పనిచేసే మనిషి ఇచ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. సినిమా చూస్తున్నంత సేపు ఆ మనిషి విక్రమ్ ఇంటి పనిమనిషిగా అనుకుంటాము.కానీ చివరలో ఏజెంట్ టీనా అంటూ ఒక్కసారిగా ట్విస్ట్ రివిల్ చేసేసరికి థియేటర్ లు బ్లాస్ట్ అయిపోయాయి అయితే ఇదే ట్విస్ట్ ని కమలహాసన్ కంటే ముందు నందమూరి బాలకృష్ణ ఇచ్చారు. అదేంటి విక్రమ్ సినిమాలో బాలకృష్ణ ఎక్కడున్నారు అనుకుంటున్నారా?బాలకృష్ణ ట్విస్ట్ ఇచ్చింది విక్రమ్ సినిమాలో కాదు తాను హీరోగా వచ్చిన లయన్ సినిమాలో. లయన్ సినిమా 2015 లో వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ విలన్ ప్రదీప్ రావత్ ఇంటికెళ్లి వార్నింగ్ ఇస్తారు.

నీ పెరటి లో పెరిగే మొక్కైనా, వాకిటి లో మొరిగే కుక్క అయినా సరే నా కంట్రోల్ కి రావాల్సిందే అని వార్నింగ్ ఇస్తారు. ఈ సినిమాలో ప్రభాకర్, ఎల్లమ్మ అంటూ విలన్ ఇంటి లో ఉండే తన ఏజెంట్లను పిలిచి పెద్ద ట్విస్ట్ ఇస్తారు.ఇది చూసిన ఎవరైనా సరే అరే కమలహాసన్ కంటే మన నందమూరి బాలకృష్ణ ఈ పని ముందు చేశారా అంటూ అనకమానరు.

Watch Video:

ALSO READ : నెక్స్ట్ అల్లు అర్జున్ ఇతనే… ఒక్క పాటతో తెలుగులో ఫేమస్ అయిపోయాడు..! అసలు ఎవరు ఇతను..?