Ads
అవికా గోర్ ఈ పేరంటే పెద్దగా తెలియకపోవచ్చు గాని, చిన్నారి పెళ్లికూతురు అంటే తెలుగు వారందరూ గుర్తుపడతారు. హిందీలో బాలిక వధు సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరుతో డబ్ చేసి టెలికాస్ట్ చేశారు. ఈ సీరియల్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో మెయిన్ లీడ్ గా చేసిన అవికా గోర్ తర్వాత తెలుగులో మంచి మంచి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
Video Advertisement
రాజ్ తరుణ్ పక్కన ఆమె నటించిన ఉయ్యాల జంపాల చిత్రం మంచి హిట్ అయి ఆమెకి బాగా ప్లస్ అయింది. ఆ తర్వాత తెలుగులో వరుస పెట్టి ఆఫర్స్ వచ్చాయి.నాగశౌర్యతో కలిసి లక్ష్మీ రావే మా ఇంటికి, రాజ్ తరుణ్ తో కలిసి సినిమా చూపిస్తా మావా, నిఖిల్ తో కలిసి ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాల్లో నటించింది. ఇక వరుస ఆఫర్లతో ఈ భామ సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.
తాజాగా ఓంకార్ డైరెక్షన్ లో మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో అవికా తన నటనతో బాగా అలరించింది. ఈ సిరీస్ కూడా డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీరిస్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మొదటి సారిగా ఓటీటీ కంటెంట్ లోకి అడుగుపెట్టిన అవికా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇదే తరహాలో మరో సిరీస్ చేసేందుకు ముందుకు వచ్చింది.ప్రస్తుతం ఆమె నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘వధువు’. మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనేది క్యాప్షన్ గా పెట్టారు. కాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. దీపావళి కానుకగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్ ను చూస్తే పెళ్లి కూతురు గెటప్ లో ఆవేదనగా కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లుగా అవికా కనిపిస్తుంది.ఇక వధువు సిరీస్ లో బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సిరీస్ విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించ లేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ సిరీస్ పోస్టర్ చూస్తుంటే.. థ్రిల్లర్ జోనర్ లాగా కనిపిస్తుంది. మరో థ్రిల్లర్ ఓటీటీలో వచ్చేందుకు అవికా రెడీ అవుతుంది. ఈ సిరీస్ కూడా హిట్ అయితే అవికాకి వరుస పెట్టి ఓటిటి ఆఫర్లు క్యూ కడతాయి అనడంలో సందేహం లేదు.
Also Read:నా గొంతు నుండి వస్తే ప్రూవ్ చేయండి..!” అంటూ… “మాధవి లత” కామెంట్స్..! పోస్ట్ లో ఏం ఉందంటే..?
End of Article