Ads
హిందీలో రిలీజ్ అయినా కూడా, తెలుగు వాళ్ళని సైతం చర్చించుకునేలా చేసిన సినిమా యానిమల్. సందీప్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అసలు సందీప్ రెడ్డి కారణంగానే తెలుగులో కూడా ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది.
Video Advertisement
రణబీర్ కపూర్ కి కూడా తెలుగులో చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ సినిమా సాధారణ సినిమాలకు భిన్నంగా ఉంది అని, ఇందులో హీరో పాత్ర చేసిన కొన్ని పనులు అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. అయితే సినిమాలో హీరో ఆల్ఫా మేల్ అంటూ ఒక విషయాన్ని చెబుతాడు. తాను ఆల్ఫా మేల్ అంటూ, అసలు ఆల్ఫా మేల్ అంటే ఏంటి అనేది హీరోయిన్ కి వివరిస్తాడు.
ఆల్ఫా మేల్ అంటే ఏంటి..?
బలంగా ఉండే మగవాళ్ళు అడవుల్లోకి వెళ్లి వేటాడే వాళ్ళు. ఆ వేటాడినప్పుడు వచ్చిన ఫలాన్ని అందరికీ పంచేవాళ్ళు. ఆడవాళ్లు ఏమో భోజనాలు వండేవారు. అందరికీ ఆహారాన్ని వండి పెట్టేవాళ్ళు. అంతే కాకుండా ఆ వేటగాళ్లలో ఎవరితో ఆడవాళ్లు పిల్లల్ని కనాలి అనేది కూడా నిర్ణయించుకునేవాళ్లు. తమను ఎవరు కాపాడుతారు? తమతో ఎవరు ఉంటారు? ఈ విషయాలు అన్నీ పరిగణలోకి తీసుకునే వాళ్ళు. అని హీరో చెప్తాడు. హీరో చెప్పిన మాటలకు హీరోయిన్ కూడా సరే అని తల ఊపి అతను ఆల్ఫా మేల్ అని అంగీకరిస్తుంది.
అయితే, ఈ విభాగంలోకి రాని మగవాళ్ళు ఎలా ఉంటారు అంటూ హీరో మరొక ఉదాహరణ కూడా చెప్తాడు. ఆల్ఫా మేల్ కానీ మగవాళ్ళు బలహీనంగా ఉంటారు. కవితలు రాస్తారు. చాలా సున్నితంగా ఉంటారు. ఆడవాళ్ళని ఆకర్షించడానికి వాళ్ళ కవితల్లో చంద్రుడు, నక్షత్రాలు వంటి పదాలను కూడా ఉపయోగిస్తారు అంటూ చెప్తాడు. అసలు శారీరకంగా బలంగా లేని వాళ్ళు సమాజానికి పనికిరారు అన్నట్టు హీరో వాదిస్తాడు.
ఆల్ఫా మేల్ లక్షణాలు ఎలా ఉంటాయి..?
బీబీసీ తెలుగు కథనం ప్రకారం, అసలు ఆల్ఫా మేల్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
#1 ఆల్ఫా మేల్ అంటే ఉత్తమ పురుషుడు అని అర్థం. వాళ్లు ఉత్తమ పురుషుడు అని ఎవరు అనరు. వారికి వాళ్లే అనుకుంటారు. అంటే ఆధిపత్య ధోరణి వారిలో అంత ఎక్కువగా ఉంటుంది. తన ఇంట్లో వారు ఏం పనులు చేయాలి? ఎవరిని ప్రేమించాలి? ఇవన్నీ కూడా తాను నిర్ణయించగలను అని ఈ ఆల్ఫా మేల్ పురుషులు అనుకుంటారు. అందుకే ఈ సినిమాలో హీరో కూడా తన అక్క ఎవరిని పెళ్లి చేసుకోవాలి? గీతాంజలి ఎలా ఉండాలి? అనే విషయాలని చెప్తాడు.
#2 వీళ్ళకి ఆడవాళ్లు బలవంతుల్లాగా కనిపించరు. సాధారణంగానే బలహీనమైన వారిని కాస్త చులకనగా చూసే వీళ్ళు, ఆడవాళ్ళని ఇంకా బలహీనంగా చూస్తారు. ఆడవాళ్లు కాస్త గట్టిగా మాట్లాడినా, కాస్త డామినేట్ చేసినా కూడా వీరు తట్టుకోలేరు. వీళ్ళు ఏం చెప్తే ఆడవాళ్లు అలాగే చేయాలి అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళకే ఎక్కువగా తెలుసు అనే ఒక ఆలోచనలో ఉంటారు.
#3 ఎక్కడైనా సరే, ఎవరి మీద అయినా సరే వీరిదే పై చేయి ఉండాలి. వీరి మీద ఎవరైనా కూడా కాస్త డామినేటింగ్ గా మాట్లాడితే వీళ్లు తట్టుకోలేరు. ఈ ఆలోచన పెరుగుతూ వచ్చాక, ఒక వయసుకి వచ్చాక, తమతో పాటు ఉండే అందరిపై కూడా వీళ్లు వారి కంట్రోల్ ఉండాలి అని అనుకుంటారు. అలా ఉండకపోతే ఎంత గొడవ అయినా పడతారు.
#4 అలా అని వీరికి ప్రేమ ఉండదు అని అనలేము. ఉంటుంది. కాకపోతే అవతలి వాళ్ళు ప్రేమని తీసుకోగలిగిన వీళ్లు, వారి కోపాన్ని మాత్రం తీసుకోలేరు. అక్కడ మాత్రం వీరి కంట్రోల్ ఉండాలి అనుకుంటారు. ఏ విషయాన్ని అయినా సరే హింసతోనే పరిష్కరిస్తారు. వీరి సొంత వారితో గొడవ అయినా కూడా అది హింసకి దారి తీస్తుంది. ఇంకొకరితో గొడవ అయినా కూడా అలాగే జరుగుతుంది.
#5 ఇంకొకరి అభిప్రాయాలని కూడా వీరు అంత పెద్దగా తీసుకోలేరు. వారికి ఒక న్యాయం, తమతో ఉండేవారికి ఇంకొక న్యాయం అని అనుకుంటారు. ఈ సినిమాలో హీరో విషయంలోనే, తన అక్కకి భర్త చనిపోతే తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకోమని చెప్తాడు. కానీ హీరోయిన్ ని మాత్రం తాను చనిపోయినా కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్తాడు. అంతే కాకుండా, హీరో ఇంకొక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు అని తెలిశాక, హీరోయిన్ తాను కూడా మరొకరిని ప్రేమిస్తాను అంటే, చంపేస్తాను అని అంటాడు. తాను చేస్తే కరెక్ట్. ఇంకొకరు చేస్తే తప్పు అనే లాగా వీళ్ళ ఆలోచన ఉంటుంది.
ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు నిజంగానే ఉత్తమ పురుషులా? అంటే, కాదు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు నిజ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినవారిని కూడా పోగొట్టుకుంటారు. అందుకే సినిమాలో హీరో చేసిన పనులని తప్పులుగానే చూపించారు. ఎందుకంటే నిజంగా ఇలాంటి పనులు చేస్తే ఆ వ్యక్తులు జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా వారు ఉన్న సమాజంలో, వారి కుటుంబంలో ఉన్న వాళ్లు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ALSO READ : DIL RAJU SONG: ఆ పాట పాడింది దిల్ రాజు నా….. అసలు తెలియలేదే…!
End of Article