Ads
పరభాష నటులకి కానీ, పరభాష సినిమాలకు కానీ తెలుగు ఇండస్ట్రీ లో ఎంత ఆదరణ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వేరే ఇండస్ట్రీకి చెందిన నటులు కూడా తెలుగు ఇండస్ట్రీలో నటిస్తూ ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
Video Advertisement
దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్ళు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ డబ్బింగ్ సినిమాలు వస్తున్నా కూడా అది డైరెక్ట్ తెలుగు సినిమాలా కనిపించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే, ఇప్పుడు తెలుగులో మరొక మలయాళం హీరో కూడా నటిస్తున్నారు. ఆయన పృథ్వీరాజ్ సుకుమారన్. సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు పృథ్వీరాజ్. అంతకుముందు ఎన్నో డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వాళ్ళకి పృథ్వీరాజ్ తెలుసు. అయితే సలార్ సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమాలో పృథ్వీరాజ్ నటించారు. ఇంకొక విషయం ఏంటి అంటే పృథ్వీరాజ్ ఈ సినిమాలో తెలుగు డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు.
తెలుగు మాత్రమే కాదు. సలార్ ఎన్ని భాషల్లో విడుదల అవుతుందో, అన్ని భాషల్లో పృథ్వీరాజ్ తన గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్నారు. అయితే పృథ్వీరాజ్ నటించిన మొదటి తెలుగు సినిమా ఇది కాదు. 2010 లోనే పృథ్వీరాజ్ ఒక డైరెక్టర్ తెలుగు సినిమాలో నటించారు. ఆ సినిమా పేరు పోలీస్ పోలీస్. ఈ సినిమాలో హీరో శ్రీ రామ్ తో పాటు పృథ్వీరాజ్ నటించారు. ఈ సినిమాకి మన్మోహన్ చల్లా దర్శకత్వం వహించారు. ఇందులో కమలిని ముఖర్జీ, సంజన గల్రానీ హీరోయిన్లుగా నటించారు.
2008 లో ఈ సినిమా మొదలు అయ్యింది. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ తనని తాను మార్చుకున్నారు కూడా. పోలీస్ పాత్ర కోసం కాస్త బరువు కూడా పెరిగారు. ఈ సినిమాలో డిఎస్పి రవికాంత్ అనే పాత్రలో పృథ్వీరాజ్ నటించారు. మొదటి తెలుగు సినిమా అయినా కూడా పోలీస్ పోలీస్ సినిమాలో పృథ్వీరాజ్ తన సొంత గొంతునే తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు. మళ్లీ దాదాపు 13 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమాలో పృథ్వీరాజ్ కనిపిస్తున్నారు. ఇంక సలార్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో వర్ధరాజమన్నార్ అనే పాత్రలో పృథ్వీరాజ్ నటించారు. పృథ్వీరాజ్ గెటప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది.
watch video :
ALSO READ : SALAAR: సలార్ రిలీజ్ ట్రైలర్ లో ఈ రెండు సీన్స్ గమనించారా.? దీని వెనక అర్ధం అదేనా.?
End of Article