Ads
దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర నటుడు డిఎండికే అధినేత విజయకాంత్ అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్ 28వ తేదీన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Video Advertisement
ఇటీవల నిమోనియాతో బాధపడుతూ హాస్పిటల్ లో చేరిన ఆయన కొద్దిరోజుల తర్వాత చికిత్స పొందిన అనంతరం కోలుకున్నారు కానీ కరోనా వైరస్ బారిన పడటంతో వెంటనే చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ లో చేర్పించారు.
అయినప్పటికీ ఆయన ప్రాణం దక్కకపోవడం విచారకరం. విజయ్ కాంత్ మధురై కి చెందిన వ్యక్తి. ఈయనకి ప్రేమలతతో 1990 జనవరి 31వ తేదీన వివాహం జరిగింద వారి ఇద్దరిదీ పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. వారికి ఇద్దరు కుమారులు అందులో షణ్ముగ పాండ్యన్ నటుడిగా రాణిస్తున్నారు. ఎప్పుడో విజయ్ కాంత్ భార్య ప్రేమలత ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది.
అందులో ఆమె తన పెళ్లికి సంబంధించిన విశేషాలను చెప్పుకొచ్చింది. విజయ్ కాంత్ మధురై కి చెందినవారు మేము వెల్లూరులో స్థిరపడిన ఫ్యామిలీ. రెండు కుటుంబాల మధ్య ఎలాంటి బంధుత్వము లేదు మా ఇద్దరి కలయిక స్వర్గంలోనే కుదిరిందని భావన కలుగుతూ ఉంటుంది. పెద్దల సమక్షంలో జరిగిన పెళ్లి చూపులు కోసం మొదటిసారి మా ఇంటికి విజయకాంత్ వచ్చారు. ఆయన ప్రవర్తన చూసి మా నాన్న వెంటనే ఇంప్రెస్ అయిపోయారు.
ఎందుకంటే ఆయన ఒక హీరోలాగా కాకుండా సాధారణ వ్యక్తి లాగా బిహేవ్ చేశారు అని చెప్పుకొచ్చారు ప్రేమలత. పెళ్లిచూపుల తరువాత పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. పెళ్ళికి ముందు మా మధ్య ఎన్నో అనుభూతులు పంచుకున్నాం అని ప్రేమలత చెప్పారు. 1952 ఆగస్టు 25వ తేదీన జన్మించిన విజయ్ కాంత్ అసలు పేరు నారాయణ విజయరాజు అలగర్ స్వామి. 1979లో ఇంకుమ్ ఇలమై అనే సినిమా ద్వారా కెరియర్ ప్రారంభించి సూపర్ స్టార్ గా ఎదిగారు అభిమానులు ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకునే విజయ్ కాంత్ మరణం సినీ లోకానికి నిజంగా తీరని లోటు.
End of Article