Ads
అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట ఎంత ఘనంగా జరిగిందో తెలిసిందే. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరయ్యారు. శ్రీరాముని రూపాన్ని అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి రూపొందించారు. అయితే అరుణ్ యోగిరాజ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు.
Video Advertisement
తాను శ్రీరాముని రూపాన్ని రూపొందించేటప్పుడు ప్రతిమ ఒకలాగా ఉంది అని, ప్రాణ ప్రతిష్ట జరిగాక శ్రీరాముడు మరొక లాగా కనిపించారు అని అన్నారు. ప్రాణ ప్రతిష్ట జరగకముందు రాముడి రూపాన్ని, ప్రాణ ప్రతిష్ట జరిగాక చూపించిన రాముని రూపాన్ని చూస్తే నిజంగానే మరొక లాగా ఉన్నట్టు తెలిసిపోతుంది.
ఈ విషయం మీద అరుణ్ యోగిరాజ్ మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీరాముని రూపాన్ని రూపొందించడం కోసం ఏడు నెలలు కష్టపడ్డారు అని చెప్పారు. బాలుడి పోలికలతో ఉన్న శ్రీరాముడిని రూపొందించడానికి ప్రయత్నించారు అని, కాబట్టి బాలుడిగా ఉన్న శ్రీరాముడి పోలికలు ఎలా ఉంటాయి అని ఒక ఆలోచన రావడానికి చాలా సమయం పట్టింది అన్నారు. భక్తులందరి భావనని ఒక విగ్రహం రూపంలో రూపొందించడం అనేది చాలా సమయంతో కూడుకున్న విషయం అని, శ్రీరాముడిని చూశాక చాలా ఆనందంగా అనిపించింది అని అన్నారు.
అయితే తను విగ్రహాన్ని రూపొందించినప్పుడు శ్రీరాముడి మూర్తి ఒకలాగా ఉంది అని, ప్రాణ ప్రతిష్ట చేసాక మరొక లాగా కనిపించింది అని అన్నారు. ఇందులో తాను చేసింది ఏమీ లేదు అని, దేవుడే వివిధ రూపాలు ధరించారు అని అన్నారు. విగ్రహం రూపొందిస్తున్న సమయంలో తన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఆజ్ తక్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణ్ యోగిరాజ్ తెలిపారు. ఏడు నెలలు తనకి అసలు నిద్ర పట్టలేదు అని, నిద్రపోయక కూడా శ్రీరాముడే కనిపించేవారు అని తెలిపారు. అరుణ్ యోగిరాజ్ కుటుంబం దాదాపు 300 సంవత్సరాల నుండి విగ్రహాలు రూపొందిస్తున్నారు.
ఇప్పుడు అరుణ్ యోగిరాజ్ ఐదవ తరానికి చెందినవారు. తన తండ్రి తనకి మొదటి గురువు అని అరుణ్ యోగిరాజ్ చెప్తారు. విగ్రహాన్ని రూపొందించే ముందు అరుణ్ యోగిరాజ్ కి ఆలయ ట్రస్ట్ విగ్రహం ఎలా ఉండాలి అనే విషయం మీద కొన్ని సూచనలు ఇచ్చారు. ముఖంలో చిరునవ్వు ఉండాలి అని, ఐదు సంవత్సరాల బాలుడి రూపం ఉండాలి అని, దివ్యమైన రూపం ఉండాలి అని, యువరాజు లాగా కనిపించాలి అని చెప్పారు. దేవుని చూశాక నిజంగా దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందించారు.
ALSO READ : అయోధ్య రామ మందిరంలో చోటు దక్కని మూడవ విగ్రహం ఏదో తెలుసా..? ఆ విగ్రహాన్ని ఎవరు రూపొందించారు అంటే..?
End of Article