Ads
ఎన్నో సంవత్సరాల నుండి చాణక్య నీతి అనేది జీవన విధానానికి ఒక నిఘంటువులాగా పనిచేస్తుంది. చాణుక్యుడు ఎన్నో విషయాలని చెప్పారు. అవి వృత్తిపరమైన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కూడా ఒక మనిషికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అలా చాణుక్యుడు పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా చెప్పారు.
Video Advertisement
సాధారణంగా పెళ్లికి ముందు ఒక అబ్బాయి గురించి ఒక అమ్మాయి, అమ్మాయి గురించి ఒక అబ్బాయి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే అమ్మాయిల గురించి మాత్రం అబ్బాయిలు ఇలాంటి విషయాలు తప్పక తెలుసుకోవాలి అని చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
# ఒక అమ్మాయి సౌందర్యాన్ని చూసి అసలు పెళ్లి చేసుకోవద్దు. ఒక అమ్మాయి తెలివి, ఆమెకి ఉన్న ప్రతిభ కూడా చాలా ముఖ్యం. కేవలం అందం మాత్రమే చూసి అయితే అసలు పెళ్లి చేసుకోవద్దు.
# ముందుగా ఆ అమ్మాయి వారసత్వాన్ని తెలుసుకోవాలి. అమ్మాయి కుటుంబ నేపథ్యం ఏంటి? ఆర్థికంగా అమ్మాయి ఎలా నడుచుకుంటుంది అనే విషయాలన్నీ తెలుసుకోవాలి. అలాగే అమ్మాయికి సామాజిక బాధ్యత ఎంత వరకు ఉంది అనే విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ భాగస్వామి కుటుంబం అనేది తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటారు.
# అబద్ధాలు చెప్పే అమ్మాయిలని అసలు పెళ్లి చేసుకోవద్దు. ఈ అబద్ధాలు చిన్న చిన్న వాటితో మొదలు అయ్యి, తర్వాత పెద్ద వాటి వరకు వెళ్తాయి. కాబట్టి అబద్ధాలు ఆడే అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు.
# అమ్మాయికి సాహసం, పట్టుదల కచ్చితంగా ఉండాలి. కష్ట సమయాల్లో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబానికి అండగా నిలబడాలి. కోపం తక్కువగా ఉండాలి. సహనం ఎక్కువగా ఉండాలి. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.
# మీ భాగస్వామి ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఎంత వరకు పాల్గొంటారు కూడా తెలుసుకోవడం ముఖ్యమైన విషయం. ఆధ్యాత్మికత ఎక్కువగా ఉన్నవారు గౌరవప్రదంగా ఉంటారు. అలాంటి వారి కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటారు. కాబట్టి ఆధ్యాత్మికత ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.
భార్య భర్తల బంధం అనేది ఎంత దృఢంగా ఉంటే వారి భవిష్యత్తు కూడా అంత బాగుంటుంది. కాబట్టి ఒక వ్యక్తి తనకి కాబోయే భార్యని ఎంచుకునే ముందు ఇవన్నీ కచ్చితంగా చూడాలి అని చాణుక్యుడు చెప్పారు.
ALSO READ : కుమారి ఆంటీ తర్వాత ఫుడ్ బిజినెస్ లో ఫేమస్ అయిన మరొక ఆవిడ ఎవరో తెలుసా..? ఇక్కడ ఒక ప్లేట్ ధర ఎంతంటే..?
End of Article