Ads
ఓ సాధారణ గృహినికి వచ్చిన ఆలోచన ఈరోజు నలబై మందికి ఉపాధి కలిగేలా చేసింది. తమకు వచ్చిన విద్యతోనే ఆ మహిళలు లక్షలు సంపాదించే మార్గాన్ని తెలిపింది. అది కూడా సంప్రదాయ వంటకాలతో సరదాగా మొదలుపెట్టిన ఫుడ్ బిజినెస్ ఇప్పుడు ఆ మహిళల కుటుంబ భారాన్ని కూడా మోసే రేంజ్ కి చేరుకుంది.
Video Advertisement
మొన్నటివరకు కిచెన్ కే పరిమితమైన ఈ మహిళలు ప్రారంభించిన ఫుడ్ గార్డెన్, ఇప్పుడు నెలకు పన్నెండు లక్షల రూపాయల టర్నోవర్ కు చేరుకుంది. విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన కన్యాకుమారి తనతో పాటు తోటి గృహిణులకు ఉపాధి కల్పిస్తూ, సంప్రదాయ వంటల బిజినెస్ లో ఆరితేరారు.
పార్వతీపురంకు చెందిన కన్యాకుమారి పదేళ్ళ క్రితం వరకు సాధారణ గృహిణి. ఇంట్లో ఖాళీగా ఉండే సమయంలో ఏదైనా చేయాలని అనుకునేవారు. ఆ క్రమంలో మెల్లగా పిండివంటలు, స్వీట్స్, బేకరీ ఐటమ్స్ చేయడం మొదలుపెట్టారు. తనకు తోడుగా పక్కనే ఉన్న మహిళను తీసుకొచ్చారు. అలా క్రమంగా ఆమెకు నలబై మంది వరకు తోడు అయ్యారు. ఇంటి పై ప్రాంగణాన్ని కన్యాకుమారి సంప్రదాయ వంటకాలు మరియు బేకరీ ఐటమ్స్ తయారు చేయడం కోసం అనువుగా మార్చారు.
ఆమె బెంగళూరుకు వెళ్ళి కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ తీసుకుని, తోటివారిలో నైపుణ్యం పెంచుతున్నారు. అరకేజీ మినప ఉండలతో ప్రారంభం అయిన”ఫుడ్ గార్డెన్” ప్రస్తుతం 300 రకాల వంటకాలకు చేరింది. నెలకు 6 వేల రూపాయలు పెట్టుబడితో మొదలయిన ఈ వ్యాపారం పన్నెండు లక్షల రూపాయలకు వృద్ధి చెందింది. ఫుడ్ గార్డెన్‌లో తయారు చేసిన వంటకాలు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకి అందుబాటులో ఉండేందుకు పార్వతీపురంలో కూడా షాప్ ను నిర్వహిస్తున్నారు. వ్యాపారాభివృద్ధికి ఇంటర్నెట్ ద్వారా ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి చెప్పారు.
ఈ రోజుల్లో చాలామంది ప్రజలు సంప్రదాయక వంటకాల తయారీని, టేస్ట్ ను మరచిపోతున్నారు. అందుకే తెలుగు సంప్రదాయ వంటలు రుచి చూపించడం కోసం ఈ ఫుడ్ గార్డెన్ ను మొదలుపెట్టము. ఈ బిజినెస్ మొదలుపెట్టిన కొత్తలో వంటలు సరిగ్గా కుదరక పలు ఇబ్బందులు కూడా పడ్డాం. అప్పుడు వాటిని కొనేవారు కాదు. పోనూ పోనూ వంటలు నేర్చుకున్నాము. ప్రస్తుతం మా వంటలుబాగా ఇష్టపడుతున్నారని కన్యాకుమారి చెప్పుకొచ్చారు.
Also Read: గొప్ప మనసున్న నటుడు నందు.. ఏకంగా 800 మందికి వండి వడ్డించిన ఘనుడు!
End of Article