Ads
తమిళ సినిమాల ద్వారానే తెలుగులో గుర్తింపు సంపాదించుకున్న హీరో ధనుష్. గత సంవత్సరం సార్ తో తెలుగు సినిమాలో కూడా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సంవత్సరం కెప్టెన్ మిల్లర్ సినిమాలో కూడా ధనుష్ నటించారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే, మరొక పక్క దర్శకుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా కూడా పయనాన్ని సాగిస్తున్నారు ధనుష్. అయితే, ధనుష్ ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా గారి బయోపిక్ లో నటించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల లాంచ్ కార్యక్రమం జరిగింది.
Video Advertisement
సాధారణంగా ధనుష్ పాడుతూ ఉంటే ఇళయరాజా గారు పాడినట్టే అనిపిస్తుంది అని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ధనుష్ ఈ పాత్రకి సరిగ్గా సరిపోతారు అని చాలా మంది అంటున్నారు. ధనుష్ ఈ పాత్రలో ఎలా ఉండబోతున్నారో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని, కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యురీ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారు. నిరవ్ షా ఈ సినిమాకి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇళయరాజా గారు ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ప్రముఖ హీరో కమల్ హాసన్ గారు రాస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పోస్టర్ మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో ఇళయరాజా గారు తన సోదరుడు భవాల్‌గారి పాటల బృందంలో చేరడం, ఆ తర్వాత వామపక్ష సభల్లో పాడడం, అవకాశాల కోసం చెన్నైకి వెళ్లి ఆఫీసుల చుట్టూ తిరగడం, ఆ తర్వాత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం అనే విషయాలని చూపించబోతున్నారు. ఇళయరాజా గారు తేని జిల్లాలోని ఫర్మాన్‌పురంకు చెందినవారు. అయితే, ఈ పోస్టర్ చూస్తూ ఉంటే ఇళయరాజా గారు చెన్నైకి వచ్చి, సెంట్రల్ లో దిగినట్టు ఉంది. అప్పట్లో తేని జిల్లా మధురై జిల్లలోని ఒక భాగం. కాబట్టి తేనిలో నివసించే వారు ఎక్కడికి అయినా వెళ్లాలి అంటే, మధురైకి వెళ్లి, అక్కడి నుండి రైలు ప్రయాణం, లేదా బస్సు ప్రయాణం చేసేవారు.
ఇటీవల తేని జిల్లాలోని బోధినాయకనూరు ప్రాంతం నుండి మధురై మీదుగా సెంట్రల్ కి వెళ్లే ట్రైన్ సౌలభ్యం ఉంది. “అప్పట్లో ఇళయరాజా గారు నివసించే ఫర్మాన్‌పురం నుంచి మధురై కి ట్రైన్ ప్రయాణంలో వెళ్లి చెన్నై సెంట్రల్ లో దిగడం ఎలా అవుతుంది?” అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని, ఈ విషయం మీద కామెంట్ ని కూడా జత చేస్తూ, బ్లూ సట్టై మారన్ అనే ఒక ప్రముఖ క్రిటిక్ ట్వీట్ చేశారు. నెటిజన్ చెప్పిన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, “కనీస రీసెర్చ్ కూడా చేయకుండా పోస్టర్ డిజైన్ చేశారు. అరుణ్ మాథేశ్వరన్, ధనుష్ ఇంకా ఏం చేస్తారో చూడాలి” అంటూ పోస్ట్ చేశారు. ఈయన చెప్పిన విషయానికి ఏకీభవిస్తూ చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు.
அடிப்படை ஆராய்ச்சி கூட இல்லாத போஸ்டர் டிசைன்.
அருண் மாதேஸ்வரனும், தனுஷூம்.. இன்னும் என்னவெல்லாம் செய்ய காத்துருக்காங்களோ.. pic.twitter.com/WZG2OIJWQ9
— Blue Sattai Maran (@tamiltalkies) March 21, 2024
ALSO READ : పెళ్ళైన 13 రోజులకే అలా చేసేవాడు…విజయ్ చనిపోయాక అసలు ఏం జరిగిందో చెప్పిన కమెడియన్ భార్య.!
End of Article