“చిరంజీవి లాంటి వ్యక్తి ముందు ఇలాంటి పని చేయడం ఏంటి..?” అంటూ… “విజయ్ దేవరకొండ” మీద కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“చిరంజీవి లాంటి వ్యక్తి ముందు ఇలాంటి పని చేయడం ఏంటి..?” అంటూ… “విజయ్ దేవరకొండ” మీద కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by Harika

Ads

సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో ఎదిగి, ఇవాళ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటులు అనే ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చే నటుడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి సినిమాల్లోకి వచ్చే ముందు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కరు కూడా చిరంజీవికి తెలియదు. అయినా కూడా ఇండస్ట్రీలోకి వచ్చి, ముందు సహాయ పాత్రల్లో నటించి, ఆ తర్వాత విలన్ పాత్రల్లో నటించి, ఆ తర్వాత హీరోగా మొదలుపెట్టి, మెగాస్టార్ గా ఎదిగారు. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. చిరంజీవి అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా చాలా గౌరవం ఉంటుంది.

Video Advertisement

చిరంజీవి అంటే ప్రతి ఒక్కరూ కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలాగా భావిస్తారు. దాంతో చిరంజీవి ముందు అందరూ వినయంగా ఉండాలి అని, ఆయనని గౌరవంగా మాట్లాడించాలి అని అందరూ అనుకుంటారు. అందుకే చిరంజీవి ముందు ఎవరైనా యంగ్ హీరో కాస్త ఫ్రెండ్లీగా ప్రవర్తించడానికి ట్రై చేస్తే ప్రేక్షకులు కామెంట్స్ చేస్తారు. ఇటీవల అలాగే జరిగింది. విజయ్ దేవరకొండ, చిరంజీవి కలిసి ఒక ఈవెంట్ కి హాజరు అయ్యారు. అందులో విజయ్ దేవరకొండ, చిరంజీవిని కొన్ని ప్రశ్నలు అడిగారు. అందుకు చిరంజీవి సమాధానం చెప్పారు. అరగంటకి పైన ఈ ఇంటర్వ్యూ సాగింది.

comments on vijay devarakonda

ఇంటర్వ్యూలో మధ్యలో విజయ్ దేవరకొండ చిరంజీవి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి ముందు ఇంకొక వ్యక్తి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అగౌరవంగా భావిస్తారు. అలాంటిది చిరంజీవి ముందు అలా ఒక యంగ్ హీరో చేయడం అనే విషయం ప్రస్తుతం కామెంట్స్ కి గురి అయ్యింది. ఇంటర్వ్యూ అంతా కూడా విజయ్ దేవరకొండ ఇలా కూర్చోలేదు. మధ్యలో మామూలుగానే కూర్చున్నారు. కానీ తర్వాత కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. దాంతో చిరంజీవి ముందు ఇలా కూర్చోవడం ఏంటి అంటూ కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. అలాంటి వ్యక్తి ముందు కూర్చునే పద్ధతి ఇదేనా అని అంటున్నారు. ఈ విషయం మీద కామెంట్స్ వస్తున్నాయి.

ALSO READ : ఈ 10 సినిమాల్లో తన తోటి వయసు వారికి “ప్రకాష్ రాజ్” తండ్రిగా నటించారని మీకు తెలుసా.?


End of Article

You may also like