లాక్ డౌన్ వేళ తన గొప్పమనసు చాటిన నిరుపేద మహిళ…ఏం చేసారంటే?

లాక్ డౌన్ వేళ తన గొప్పమనసు చాటిన నిరుపేద మహిళ…ఏం చేసారంటే?

by Anudeep

Ads

మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబంధాలే అని కొన్ని కొన్ని చేదు అనుభవాలను బట్టి అనుకుంటుంటాం.. కాని మానవ సంబంధాలు హార్ధిక సంబంధాలే అని కొంతమంది మానవతావాదులు ఎప్పటికప్పుడు మనకి సమాజం మీద నమ్మకాన్ని కలిగిస్తుంటారు.. అందులో ఒకామె నస్రీన్.. ఈ హార్థిక సంబంధాలని నిలబెట్టుకోవడానికి డబ్బులతో పనిలేదని…గుండె తడి ఉన్న మానవతావాదులెవరైనా కూడా ఈ  హార్థిక సంభంధాలను కొనసాగించగలరని నిరూపించిందామే..

Video Advertisement

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌కి చెందిన నస్రీన్  పేపర్‌ ప్లేట్స్‌ కంపెనీలో పనిచేస్తుంది.. రోజుకు వచ్చే  160 రూపాయలు సంపాదనతో జీవనం సాగిస్తోంది.  పెరుగిన ధరలు, ఖర్చుల దృష్ట్యా చూసుకుంటే ఆ 160రూ. చాలా తక్కువే, అయినప్పటికి ఆ వచ్చిన డబ్బులో సగాన్ని మాత్రమే కుటుంబానికి ఖర్చుపెట్టింది..మిగతా సగం డబ్బులను కూడబెట్టింద. అలా కూడబెట్టిన మొత్తం డబ్బులు 15వేలు కాగా, వాటితో నిరుపేదల ఆకలి తీర్చింది.

తను కూడబెట్టిన డబ్బుతో బియ్యంతోపాటు నాలుగు రకాల నిత్యావసర వస్తువులు, కూరగాయలను కొనుగోలు చేసి, 50 మంది నిరుపేదలకు పంపిణీ చేసింది. ఇలాంటి విపత్తు సమయాల్లో  మనం నిండు మనసుతో ఒకరికి సాయం చేసినా అది చాలా గొప్ప పనే.. 50మందికి పంపిణి చేయడం మామూలు విషయం కాదు. సాయం చేయాలనే గుణం ఉంటే చాలు, లక్షలు ఉండాల్సిన పనిలేదని మరోసారి నిరూపించింది.

మొన్నటికి మొన్న ఓ యాచకుడు వలస కూలీల ఆకలి బాధను చూసి తన దగ్గరున్న డబ్బుతో వారి ఆకలిని తీర్చాడు.  ముంబాయ్ ఆటోడ్రైవర్ శీతల్ పేదవారికి తన ఆటోలో ఉచితంగా  రవాణా సౌకర్యం సాయం చేస్తోంది..ఇప్పుడు నస్రీన్ తనకొచ్చే 160రూ..సగాన్ని పేదలకు కేటాయించింది..వీళ్లేవరూ డబ్బున్నవాళ్లు కాదు..కేవలం సాయం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు..మానవత్వం ఉన్నవాళ్లు..

అన్నట్టు చెప్పడం మర్చిపోయా మే 5వ తేదీ కారల్ మార్క్స్ జయంతి.. మానవ సంబంధాలు ఆర్దిక సంబంధాలని చెప్పింది ఆయనే..ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందని కొందరు నిరూపిస్తుంటే , హార్దిక సంబంధాలని నస్రీన్,శీతల్ లాంటి వాళ్లు నిరూపిస్తున్నారు..కరోనా కష్ట కాలంలో ఎవరికి వారు తమకు తోచిన రీతిలో సాయం చేయడానికి ముందుకు రావడం నిజంగా అభినందనీయం.


End of Article

You may also like