Ads
పేరులో “నేముంది”…? అని చమత్కారాలను పక్కన పెడదాం కాసేపు.. ఇంట్లోకి చిన్నపాపాయి వస్తే తనకి పేరు పెట్టడం అంత ఆషామాషి విషయం కాదు..దానికి పెద్ద కసరత్తే జరుగుతుంది.. సినిమాలు, సీరియళ్ళు,కథలు,నవలల పేర్ల గొడవ ఓ రేంజ్ లో ఉంటుందని మనకు తెలుసు.. అయితే ఇదేదో మధ్యతరగతి శ్రీమతి అండ్ శ్రీ కుటుంబరావు లకే కాదు సెలబ్రిటీలకూ తప్పని సిట్యుయేషన్…అతిలోక సుందరి శ్రీదేవి దంపతుల గారాల పట్టి జాన్వీ పేరు వెనక కూడా ఒక ఇంట్రస్టింగ్ విషయం ఉంది ..అదేంటంటే..
Video Advertisement
బోనీ కపూర్ నిర్మాతగా అనిల్ కపూర్, శ్రీదేవి, ఊర్మిళ ప్రధాన పాత్రలుగా నటించిన జుడాయి చిత్రంలో ఊర్మిళ క్యారెక్టర్ పేరు జాన్వీ… తెలుగులో వచ్చిన శుభలగ్నం సినిమాకి రీమేక్ మూవీనే ఈ జుదాయి.. తెలుగులో రోజా పోషించిన పాత్రను హిందిలో ఊర్మిళ పోషించింది.. ఈ సినిమా ఫిబ్రవరి ,1997లో విడుదలైంది. నెల రోజుల గ్యాప్లో అంటే మార్చి ,1997లో జాన్వి పుట్టింది. పాపకి ఏం పెట్టాలా అని చాలా ఆలోచించినప్పటికి , ఏ పేరు తట్టలేదట…అప్పుడే విడుదలై సూపర్ హిట్ అయిన జుదాయిలో ఊర్మిళ క్యారెక్టర్ బాగా నచ్చిందట శ్రీదేవికి , తన కూతురికి అదే పేరు పెట్టాలనుకుందట, దానికి బోనీ కూడా ఒకే అన్నడంతో ఆ పేరే ఫిక్సయింది.. బోని, శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో శేర్ చేసుకున్నారు..అదండీ జాన్వీ పేరు వెనుక ఉన్న కథ…
మరాఠి చిత్రం సైరాట్ రీమేక్ ధడక్ మూవీతో జాన్వీ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే..ఆ చిత్రంలో జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి..చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అంటే ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు..శ్రీదేవికూడా తన పిల్లలంటే ప్రత్యేక ప్రేమ, వారుపుట్టినప్పటి నుండి పూర్తిగా సినిమాలను పక్కన పెట్టి పిల్లల ఆలనాపాలనా చూస్కుంది, జాన్వీ కెరీర్ విషయంలో కూడా ఎంతో ఆచితూచి వ్యవహరించేది. ఇటీవల మదర్స్ డేకి జాన్వీ పెట్టిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది..
End of Article