ఒక్క సినిమాతోనే స్టార్ గా ఎదిగి…తరువాత తెరపై కనుమరుగైన 17 మంది హీరోయిన్లు వీరే.!

ఒక్క సినిమాతోనే స్టార్ గా ఎదిగి…తరువాత తెరపై కనుమరుగైన 17 మంది హీరోయిన్లు వీరే.!

by Mohana Priya

Ads

సినిమా అనేది చాలా పెద్ద ప్రపంచం. ఆ రంగుల ప్రపంచంలో ప్రతీ సినిమాకి ఎంతో మంది పరిచయం అవుతుంటారు. వాళ్లలో నటులు టెక్నీషియన్లు ఇంకా 24 కళలకి చెందిన ఎంతో మంది ఉంటారు. కానీ ఇలా పరిచయం అయిన వాళ్లలో ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా పడేది మాత్రం నటుల మీదే. ముఖ్యంగా హీరో హీరోయిన్లు. హీరోల సంగతి అలా ఉంచితే. ఒక ఏడాదిలో ఎంతోమంది హీరోయిన్లు వెండితెరకు పరిచయం అవుతారు. కానీ వాళ్లలో కొనసాగేది మాత్రం కొద్ది మంది మాత్రమే. కొంతమంది కొన్ని సినిమాల తర్వాత సడన్ గా మాయమైపోతారు. ఇవాళ అలా కొద్ది సినిమాలు చేసే తర్వాత తెలుగు తెరకు దూరమైన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

Video Advertisement

రతి ఆర్ముగం

పల్లకిలో పెళ్లికూతురు సినిమా తెలుగులో పరిచయమైన రతి తర్వాత అల్లరి బుల్లోడు, సంక్రాంతి, అలాంటి సినిమాల్లో కనిపించింది. తను నటించింది కొన్ని సినిమాలే అయినా ఆ సినిమాలో ప్రజాదరణ పొందడంతో అందరికీ గుర్తుంది. కానీ తర్వాత ఎక్కడా కనిపించలేదు తను నటించిన ఆఖరి తెలుగు సినిమా 2005 లో వచ్చిన ప్రేమ సంగమం.

 

షీనా

బిందాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది షీనా. ఆ సినిమా తర్వాత ఒక రెండు మూడు తెలుగు సినిమాలు చేసినా కానీ అవి చెప్పుకోదగ్గ ఫలితం రాలేదు. 2015 లో వచ్చిన గడ్డం గ్యాంగ్ తన చివరి తెలుగు సినిమా. తర్వాత హిందీలో 2 టీవీ సిరీస్ లో చేసింది.

గజాల

ఎన్నో హిట్ సినిమాల్లో చేసి దాదాపు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ 2011 తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాలు వదిలేయలేదు అని, అలా అని ఆఫర్లు రాక కష్ట పడటం లేదు, తనకు నటన అంటే చాలా ఇష్టమని, 50 ఏళ్లు వచ్చేంత వరకు కూడా నటిస్తూనే ఉంటానని కానీ మంచి కథలు మాత్రమే చేస్తాను అని చెప్పింది.

గౌరీ ముంజాల్

బన్నీ సినిమా తో తెలుగు తెరకి పరిచయమైన గౌరీ తర్వాత కొన్ని కన్నడ తెలుగు తమిళ్ సినిమాలు చేసింది 2011లో హోరి అనే కన్నడ సినిమా చేసింది ఆ తర్వాత ఇంకా ఎక్కడా కనిపించలేదు

శాంతి ప్రియ

భాను ప్రియ చెల్లెలు అయిన శాంతి ప్రియ మహర్షి సినిమాలో నటించింది. ఆ సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. తర్వాత తను ఎన్నో తమిళ్ సినిమాలు హిందీ సినిమాలు సీరియల్స్ లో నటించింది. కానీ తెలుగులో మాత్రం చాలా తక్కువ సినిమాలు చేసింది.

అన్షు అంబానీ

తెలుగు వాళ్ళకి మన్మధుడు సినిమా తెలియకుండా ఉండదు. ఆ సినిమా చూసిన ప్రతి వాళ్ళకి అన్షు పరిచయం అవసరం లేదు. ఒక్క సినిమాతోనే తను ఎంతో పాపులర్ అయిపోయింది. తర్వాత ప్రభాస్ తో రాఘవేంద్ర లో, మిస్సమ్మ లో ఒక గెస్ట్ రోల్ లో కనిపించింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లి పోయిందో ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఇప్పుడు తను అమెరికాలో సెటిల్ అయినట్టు అక్కడ ఒక బోటిక్ నడుపుతున్నట్టు చెప్పింది

 

 

నిత

తేజ పరిచయం చేసిన ఎంతో మంది కొత్త నటులలో అనిత ఒకరు. నువ్వు నేను సినిమాతో పరిచయం అయిన తర్వాత ఎన్నో తెలుగు తమిళ్ సినిమాలు చేశారు. తర్వాత ఇక్కడ సడన్ గా మాయమైపోయి హిందీ తెరపై కనిపించారు. ప్రస్తుతం  హిందీ సీరియల్ ఇండస్ట్రీ లో స్టార్ అయ్యారు.

నేహా బంబ్

దిల్ సినిమా తర్వాత అతడే ఒక సైన్యం లో హీరోయిన్ గా చేశారు. తెలుగులో చివరిగా 2007 లో బొమ్మరిల్లు దుబాయ్ శీను లో గెస్ట్ రోల్స్ చేశారు. తర్వాత కొన్ని హిందీ సీరియల్స్ లో కనిపించారు. 2009లో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు

నేహా ఒబెరాయ్

పవర్ స్టార్ సినిమా బాలుతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు కూడా అందుకున్నారు. తర్వాత జగపతి బాబుతో బ్రహ్మాస్త్రం అనే సినిమా చేశారు. ఇప్పుడు నటనకి దూరమయ్యారు కానీ సినిమాలకి కాదు. నేహా నోయిడా లో ఉన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కి మెంబర్ గా ఉన్నారు.

కీర్తి రెడ్డి

పరిచయం అక్కర్లేని హీరోయిన్ కీర్తి రెడ్డి. తొలిప్రేమ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. తర్వాత కొన్ని తెలుగు హిందీ తమిళ సినిమాల్లో నటించారు. అర్జున్ సినిమా తర్వాత మాయమైపోయారు

కీర్తి చావ్లా

ఆది సినిమా తో పరిచయమైంది కీర్తి చావ్లా. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనవసరం లేదు. కీర్తి తర్వాత తమిళ్ లో ఎన్నో సినిమాలు చేసింది తెలుగులో కొన్ని సినిమాలు చేసినా అవి చెప్పుకోదగ్గ పేరు పొందలేదు. 2016లో తమిళ్ సినిమా చేసిన కీర్తి తర్వాత ఎక్కడా కనిపించలేదు

అంకిత

లాహిరి లాహిరి లాహిరి లో అంకిత మొదటి తెలుగు చిత్రం. ఎన్టీఆర్ కెరీర్లో ఉత్తమ చిత్రాలలో ఒకటి అయిన సింహాద్రి లో ఒక హీరోయిన్ గా నటించింది. బాలకృష్ణ తో విజయేంద్ర వర్మ చిత్రం చేసింది. అనసూయ చేసిన చివరి తెలుగు చిత్రం. ఇప్పుడు అంకిత మల్టీమీడియా రంగంలో ఉంది.

నిఖిత

హాయ్, సంబరం, డాన్ అనసూయ, చింతకాయల రవి ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించింది నికిత. 2008 లో వచ్చిన చింతకాయల రవి తర్వాత ఎన్నో కన్నడ మలయాళం తమిళ సినిమాలు చేసింది మళ్లీ 2015లో అవును టు సినిమా తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. 2016 లో వచ్చిన టెర్రర్ తన చివరి తెలుగు సినిమా. తర్వాత 3 కన్నడ ఒక హిందీ ఒక తమిళ సినిమాలు చేసింది నిఖిత.

ఆర్తి చాబ్రియా

ఒకరికి ఒకరు లాంటి మంచి లవ్ స్టొరీ తో తెలుగులో పరిచయం అయ్యారు. హిందీ కన్నడ లో చాలా చిత్రాల్లో నటించినప్పటికీ తెలుగులో మాత్రం చాలా తక్కువ సినిమాలు చేశారు. 2015లో హిందీ టీవీ సిరీస్ లో ఒక ఎపిసోడ్ లో నటించారు. తెలుగులో తన ఆఖరి చిత్రం గోపి గోడ మీద పిల్లి.

రోషిని

మాస్టర్ సినిమాలో చిరంజీవి పక్కన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కనిపించే హీరోయిన్ గుర్తుందా? తనే రోషిని. అప్పట్లో స్టార్ హీరోయిన్ అయిన నగ్మా చెల్లెలు. తర్వాత పవిత్ర ప్రేమ సినిమాలో బాలకృష్ణతో నటించింది. శుభలేఖలు తన ఆఖరి తెలుగు సినిమా.

దీక్ష సేథ్

మిస్ ఇండియా ఫైనలిస్ట్ అయిన దీక్ష తన మొదటి సినిమానే అల్లు అర్జున్ తో చేసింది. రవితేజ గోపీచంద్ విక్రమ్ ప్రభాస్ లాంటి పెద్ద హీరోలతో నటించింది. 2015లో హిందీ సినిమాలో కూడా నటించిన దీక్ష ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. రెబల్ తెలుగులో తను చేసిన చివరి సినిమా.

షాజహాన్ పదాంసీ

ఆరెంజ్ సినిమా ఫలితం ఎలా ఉన్నా సినిమా క్రేజ్ మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. అందులో ఫ్లాష్ బ్యాక్ లో రూప పాత్ర పోషించింది షాజహాన్. షాజహాన్ తన సొంత పేరు కంటే రూప పేరుతోనే ఎక్కువగా పాపులర్ అయింది. ఆరెంజ్ తర్వాత హిందీలో దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ టు సినిమాల్లో చేసింది. తర్వాత మళ్ళీ తెలుగులో మసాలా సినిమాలో రామ్ కి జోడీగా కనిపించింది. తర్వాత 2015 లో హిందీలో ఒక సినిమా చేసింది. అదే తన ఆఖరి సినిమా. ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి సంగీతం మీద దృష్టి పెట్టింది షాజహాన్. ప్రస్తుతం తను స్పంక్ మ్యూజిక్ అనే ఒక మ్యూజిక్ ప్రాజెక్టు మీద పనిచేస్తోంది.

 

ఇలా ఇంకా ఎంతో మంది హీరోయిన్లు కొన్ని సినిమాలు చేసి మాయమయ్యారు. వీళ్లల్లో కొంతమంది సినిమా ప్రపంచానికి దూరం అయ్యి వేరే రంగంలో స్థిరపడితే. కొంతమంది సీరియల్స్ లో స్థిరపడ్డారు. మరికొంతమంది అప్పుడప్పుడు ముఖ్య పాత్రల్లో లేదా సహాయ పాత్రల్లో కనిపిస్తుంటారు.

 


End of Article

You may also like