Ads
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇటు సినిమాలలోనూ అటు రాజకీయాలలోని కూడా ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా భాస్వతారకం కేన్సర్ ఆసుపత్రిలో కూడా తన సేవలు అందిస్తున్నారు బాలకృష్ణ.ఇప్పటిదాకా ఎన్నో విలక్షణమైన పాత్రలు,వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రతేకమైన గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో బాలకృష్ణ వాణిజ్య ప్రకటనలు చేయ్యకపోవడానికి మాత్రం ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
మా నాన్నగారు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నాకు అన్నివిదాలాగాను ఆదర్శం అని బాలకృష్ణ చాలా సందర్భాలలో చెప్పారు.అయితే అంత క్రేజ్ సంపాదించుకున్న నాన్నగారు కూడా ఎప్పుడూ వాణిజ్య ప్రకనటలు చెయ్యలేదు అని బాలకృష్ణ అన్నారు.ప్రజలు ఇచ్చిన పేరు ను వాణిజ్య ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి నాన్నగారు ఎప్పుడూ ఉపయోగించుకోలేదు అని బాలకృష్ణ అన్నారు.అదే విధంగా నేను కూడా వాణిజ్య ప్రకటనలు చెయ్యలేదు.
వాణిజ్య ప్రకటనలు చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు కానీ నేను తిరష్కరించాను అని బాలకృష్ణ అన్నారు.ప్రజలు ఇచ్చిన పేరు ని ఇలా నా స్వార్ధం కోసం ఉపయోగించుకొని డబ్బు సంపాదించడం మంచి పద్ధతి కాదు అని నా అభిప్రాయం .అయినా సమాజానికి ఉపయోగపడే ప్రకటనలు ఉంటె మాత్రం అందులో నటించడానికి మాత్రం వెనుకాడనని బాలకృష్ణ స్పష్టం చేసారు.
End of Article