భానుమతి రామకృష్ణ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

భానుమతి రామకృష్ణ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

by Anudeep

Ads

చిత్రం : భానుమతి రామకృష్ణ
నటీనటులు :  నవీన్ చంద్ర, సలోని లూత్రా, రాజా చెంబోలు, హర్ష, షాలిని వద్నికట్టి
దర్శకత్వం : శ్రీకాంత్ నాగోతి

Video Advertisement

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
విడుదల తేదీ :  జులై 3 ‌ (ఆహా’యప్ ) ఓటీటీ ఫ్లాట్‌ఫామ్

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది..ప్రభుత్వాలు లాక్ డౌన్ ని విధించడం..కావున ప్రతి ఒక్కరికి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.సినిమా థియేటర్ లు మూత పడటం.తిరిగి ఎప్పుడు ప్రారంబిస్తారో ఎవరికీ క్లారిటీ లేకుండా పోవటం తో చేసేది ఏమి లేక విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు OTT ప్లాట్ ఫామ్ బాట పట్టాయి.తాజాగా నవీన్‌ చంద్ర, సలోని లూత్రా కీలక పాత్రల్లో నటించిన  ఫిల్మ్ ‘భానుమతి రామకృష్ణ’ సినిమా లో OTT ప్లాట్ ఫామ్ లో జులై 3న ఆహా’వేదికగా ఈ సినిమాను విడుదల చేసారు. శ్రీకాంత్ నాగోతి ద‌ర్శ‌కుడు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, కృష్వి ప్రొడక్షన్స్‌ పతాకంపై య‌శ్వంత్ ములుకుట్ల నిర్మించారు.

కధ :: 

30 యేళ్ళు దాటిని ఇంకా పెళ్లి కాని పాత్రలో భానుమతి హైదరాబాద్‌లో ఒక ఆఫీసు లో వర్క్ చేస్తుంది . అదే సమయంలో భానుమతి కి తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అవుతుంది.బాధ లో ఉన్న సమయంలో తన ఆఫీసు లోకి రామకృష్ణ భానుమతి కి అసిస్టెంట్‌గా వస్తాడు,రామకృష్ణ గురించి చెప్పాలి అంటే 33 ఏళ్ల వయసుదాటి పెళ్లి కానీ వ్యక్తి.ఒత్తుగా జుట్టు పెంచి.. పక్క పాపిడి దువ్వి.. నుదట బొట్టు పెట్టి కొత్తగా కనిపించాడు. అంతేకాకుండా పర్‌ఫెర్మాన్స్‌ కూడా సెటిల్డ్‌గా అనిపించింది.రామకృష్ణ ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తిత్వం రామకృష్ణది. కష్టాల్లో ఉన్నా నవ్వుతూ ఉంటాడు.రామకృష్ణ కి ఇంగ్లిష్ అంటే భయం.ఏ చిన్న డౌట్ వచ్చిన భానుమతి ని అడుగుతాడు .అలా వల్ల ఇద్దరి మద్య ఫ్రెండ్షిప్ మొదలు అవుతుంది.పెళ్లి విషయంలో ఇద్దరి  విషయాల్లో భిన్న అభిప్రాయాలు ఉంటాయి.కొన్ని కారణాల వల్ల ఇద్దరిలో ప్రేమ చిగురిస్తుంది .అనుకోకుండా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.రామకృష్ణ తన సొంత ఊరు తెనాలి కి వెళ్ళిపోతాడు.భానుమతి బాధ పడుతూ ఉంటుంది,రామకృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.ఎలా అయిన రామకృష్ణ కి తన ప్రేమ గురించి చెప్పాలి అని తపిస్తుంది.చివరికి వీళ్ళు ఎలా ఎలా ఒక్కటవుతారనేది కథ.

చివరిగా

హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే తెనాలి అబ్బాయి, విజయవాడ అమ్మాయి మధ్య సాగే లవ్‌స్టోరీ ఆసక్తిగా ఉంటుంది. కిస్‌లు, హగ్స్‌ లాంటి సీన్స్‌ ఉండే లవ్‌స్టోరీ కాదిది.సహజంగా సాగే కథ…ఎక్కడ కూడా బోరు గా మీరు ఫీల్ అవ్వరు…సినిమా చూసే సమయంలో మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను అనిపిస్తుంది…నవీన్ చంద్ర కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి చిత్రం లో నటించాడు.వైవ వర్ష పాత్ర కూడా కాస్త ఆకట్టుకుంటుంది.సంగీతం కూడా బాగా కుదిరింది.ఈ చిత్రానికి సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి..ott లో రిలీజ్ చేసిన సినిమా లో హిట్ కొట్టిన మొదటి చిత్రం అని చెప్పుకోవచ్చు.

ప్లస్ పాయింట్

లవ్‌స్టోరీ

నవీన్ చంద్ర, సలోని లూత్రా పాత్రలు

సంగీతం

స్క్రీన్ ప్లే

ఎమోషన్‌కి కనక్ట్

సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్

స్లో నేరేషన్

వినోదం

రేటింగ్ :: 3/5

గంటన్నర పాటు హ్యాపీగా సాగిపోయే ఫీల్‌గుడ్ చిత్రమని చెప్పవచ్చు.


End of Article

You may also like