సినిమాల్లో హీరో హీరోయిన్లు వేసుకున్న “కాస్ట్యూమ్స్” ని..సినిమా తర్వాత ఏం చేస్తారో తెలుసా?

సినిమాల్లో హీరో హీరోయిన్లు వేసుకున్న “కాస్ట్యూమ్స్” ని..సినిమా తర్వాత ఏం చేస్తారో తెలుసా?

by Mohana Priya

Ads

సినిమాలో హీరో హీరోయిన్లు ఎన్నో రకాల డ్రస్సులు వాడతారు. అవి ఒకవేళ కొత్తగా ఉండి జనాలకి నచ్చితే కొన్నాళ్ళ వరకూ ఆ కాస్ట్యూమ్స్ ట్రెండ్ అవుతాయి. అలాంటి మోడల్ లో ఎన్నో చోట్ల డ్రెస్సులు వస్తాయి. ఈమధ్య ఆన్లైన్లో ఆర్డర్ చేసి అచ్చం మనకి నచ్చిన యాక్టర్ వాడిన కాస్ట్యూమ్ లాంటి డ్రెస్సులే డిజైన్ చేయించుకోవచ్చు. కానీ మన హీరో హీరోయిన్లు ఆ కాస్ట్యూమ్స్ వాడేసిన తర్వాత ఏం చేస్తారో తెలుసా.

Video Advertisement

అంతకుముందు హీరో హీరోయిన్ ల కోసం ఎంత ఖరీదు పెట్టి కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసే వాళ్ళు. కొంతమంది యాక్టర్లకి వాళ్లకు ఏమైనా డ్రస్సులు నచ్చితే వాళ్ళతో పాటే తీసుకెళ్ళిపోతారు. ఇంకొంతమంది చారిటీ లో ఈ డ్రెస్సులను వేలం వేస్తారు.

దూకుడు సినిమా కోసం మహేష్ బాబు కి, సమంతకి ప్రత్యేకంగా కొన్ని కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. సినిమా అయిపోయిన తర్వాత సమంత ఆ సినిమాలో మహేష్ బాబు వాడిన కాస్ట్యూమ్స్ ని వేలం వేసి వచ్చిన డబ్బులను చారిటీకి ఉపయోగించింది. అంతేకాకుండా గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన పోలీస్ కాస్ట్యూమ్ కూడా ఒక స్వచ్ఛంద సంస్థ కు సహాయం చేయడం కోసం వేలం వేసింది.

కానీ ఇప్పుడు అలా హీరో హీరోయిన్ల కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అనేది తగ్గింది. యాక్టర్ ల కి ప్రత్యేకంగా పర్సనల్ స్టైలిస్ట్ ఉంటారు. ఆ హీరో లేదా హీరోయిన్ ఎలాంటి దుస్తులలో సౌకర్యంగా ఉంటారో ఎలాంటి వైతే వాళ్లకి సూట్ అవుతాయో పర్సనల్ స్టైలిస్ట్ల కి బాగా తెలుస్తుంది. అందుకే చాలా వరకు వాళ్లే సినిమాలో ఆ యాక్టర్ యొక్క  పాత్రకి కూడా కాస్ట్యూమ్ లను నిర్ణయిస్తారు.

ఒకవేళ సినిమాలో ఏదైనా ప్రత్యేక సందర్భం ఉండి స్పెషల్ గా ఉండే దుస్తులు కావాలి అనుకుంటే ప్రముఖ డిజైనర్ ల నుండి అద్దెకి తెచ్చుకుంటారు. మళ్లీ షూటింగ్ అయిపోగానే దుస్తులు డిజైనర్ కి తిరిగి ఇచ్చేస్తారు. అలా అయితే ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు, తర్వాత ఆ దుస్తులను వేరే వాళ్లు మళ్లీ వాడుకోవచ్చు.

ఉదాహరణకి అల వైకుంఠ పురం లో సినిమా లో రాములో రాముల పాట లో పూజా హెగ్డే వేసుకున్న డ్రస్సు అలా అద్దెకి తీసుకున్నదే. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆ డ్రెస్ ను డిజైన్ చేస్తే, ఆ సినిమా కి పూజా హెగ్డే కి స్టైలిస్ట్ గా చేసిన అశ్విన్ మావ్లే ఆ డ్రెస్సు ను సెలెక్ట్ చేసి రెంట్ కి తీసుకువచ్చి మళ్లీ డ్రెస్సు కి ఏమీ కాకుండా తిరిచ్చేసే బాధ్యతను మొత్తం చూసుకున్నారు.

ఒకవేళ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అంటే కచ్చితంగా దుస్తులు డిజైన్ చేయాల్సిందే. అలా డిజైన్ చేసిన దుస్తులను కొంతమంది సినిమా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తారు. కొంతమంది ఆ సినిమా పేరు మీద స్పెషల్ కలెక్షన్ అని చెప్పి ఆ దుస్తులను మార్కెట్లో విడుదల చేస్తారు. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ కాస్ట్యూమ్ లను తదుపరి సినిమాలు హీరోయిన్లకు వాడడం లేదా బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ లకు వాడడం చేస్తారు.

దానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే బృందావనం సినిమా లో కాజల్ వేసుకున్న ఒక డ్రెస్సు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఒక పాటలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ కి ఉంటుంది. ఈ రెండు సినిమాలకి ప్రొడ్యూసర్ దిల్ రాజు. అదే కాకుండా రారండోయ్ వేడుక చూద్దాం లో రకుల్ వేసుకున్న డ్రస్సు ఒకటి రంగులరాట్నం సినిమా లో హీరోయిన్ ఒక పాట లో వేసుకుంటుంది. ఈ రెండు సినిమాలకి ప్రొడ్యూసర్ అన్నపూర్ణ స్టూడియోస్.

 

ఇవే కాకుండా మనకి తెలియకుండా చాలా సినిమాల్లో వేరే వాళ్లు వేసుకున్న తర్వాత రిపీట్ అయ్యే డ్రెస్సులు ఉంటూనే ఉంటాయి. హీరోల విషయానికి వస్తే వాళ్లు వేసుకునేవి దాదాపు బ్రాండెడ్ దుస్తులే. అవి ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. సరిలేరు నీకెవ్వరు లో మహేష్ బాబు వేసుకున్న దుస్తులన్నీ తన సొంత బ్రాండ్ అయిన హంబుల్ అండ్ కో లోవి.

అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ కూడా క్యాజువల్ వేర్ దుస్తులను తమ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోకుండా ఆల్రెడీ ఉన్న బ్రాండెడ్ దుస్తులనే వేసుకుంటారు. హీరోయిన్లకే కాదు హీరోలకి కూడా స్టైలిస్ట్ లు ఉంటారు.

మహేష్ బాబు కి అక్షయ్ త్యాగి, జూనియర్ ఎన్టీఆర్ కి అశ్విన్ మావ్లే, అల్లు అర్జున్ కి హర్మన్ కౌర్ వీళ్లు హీరోలకి వ్యక్తిగతంగానే కాకుండా సినిమాల్లో కూడా స్టైలింగ్ చేస్తారు.అలా సినిమాల్లో హీరో హీరోయిన్లు తమ కాస్ట్యూమ్ లను ఏర్పాటు చేయించుకుంటారు.


End of Article

You may also like